హైదరాబాద్‌లో భారీ వర్షం

Submitted on 11 July 2019
Heavy rain in hyderabad today

ఉన్నట్టుండి ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలం అయింది. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని ప్రధాన రహదారుల్లో రోడ్ల మీద మోకాలు లోతు నీళ్లు చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 5గంటల 30నిమిషాల నుంచి ఏకధారగా వర్షం కురుస్తుంది. దట్టంగా మేఘాలు ఆవరించి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన భారీ వర్షం దెబ్బకు పలుచోట్ల చెట్లు, హోర్డింగుల ఊగుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు పగలే లైట్లు వేసుకొని వెళ్లాల్సి వస్తుంది.

heavy Rain
Hyderabad


మరిన్ని వార్తలు