అంచనాలను మించి...Q4లో HDFC రికార్డ్ ప్రాఫిట్

Submitted on 20 April 2019
HDFC Bank posts record profit in Q4

అంచనాలను మించి కార్టర్ ఫోర్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రికార్డు ప్రాఫిట్ పొందింది.  శనివారం (ఏప్రిల్-20,2019) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది.
Also Read : మోదీ వెబ్ సిరీస్ బ్యాన్ చేసిన ఈసీ

ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా...అది రూ.5,885.10 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ క్వార్టర్లీ ప్రాఫిట్‌లో ఇప్పటివరకు ఇదే ఎక్కువ. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.4,799.28 కోట్ల లాభాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది.

గతేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.5,005.70కోట్లు,డిసెంబర్ క్వార్టర్‌లో రూ.5,585కోట్ల ఫ్రాఫిట్‌ను బ్యాంకు రిపోర్ట్ చేసింది. దీంతో వరుసగా 3 క్వార్టర్ల నుంచి 5వేల కోట్లకు మించిన ఆదాయాన్ని హెచ్‌డీఫ్‌సీ ప్రకటించినట్లయింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. 
Also Read : బీహార్ లో మోడీ,రాహుల్ మాటల యుద్ధం

HDFC
profit
record
Q4
report

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు