తీహార్ జైలుకు వెళ్లిన కుమార స్వామి

Submitted on 21 October 2019
HD Kumaraswamy Meets DK Shivakumar In Tihar Jail

కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి తీహార్ జైలుకు వచ్చారు. జైల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో మాట్లాడటానికి 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం అక్కడకు వచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలు..తదితర వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కేసులో శివ కుమార్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. 

తన పర్యటన వ్యక్తిగతమని, శివ కుమార్ రాజకీయ ప్రతికారం ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతికార రాజకీయాలు ఆడుతోందని శివ కుమారన్ అరెస్టు అనంతరం సెప్టెంబర్ 03న కుమార స్వామి ట్వీట్ చేశారు. ప్రతిపక్ష్యాలను లక్ష్యంగా చేసుకొంటోందని తెలిపారు. 

ఇదిలా ఉంటే..మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన శివ కుమార్ జ్యుడిషియల్ కస్టడీ అక్టోబర్ 25 వరకు పొడిగించింది ఢిల్లీ హైకోర్టు. ఈయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 25న కోర్టు కొట్టివేసింది. విడుదల చేస్తే..సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. 
 

Read More : కొనసాగుతున్న పోలింగ్ : ఓటేసిన ప్రముఖులు
కొంతమంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు సపోర్టు ప్రకటించడంతో కుమార స్వామి మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మంత్రివర్గ విస్తరణ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలంటూ 2019, జులై 26వ తేదీ శుక్రవారం గవర్నర్‌ని కలిసి కోరారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయిన అనంతరం రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. అసెంబ్లీ కాల పరిమితి ముగిసే వరకు..2023 ఆర్.శంకర్, రమేశ్ జార్కి హోళి, మహేవ్ కుమటళ్లిని అనర్హులుగా ప్రకటించారు. 

Delhi: Former Karnataka CM HD Kumaraswamy arrives at Tihar Jail to meet Congress leader DK Shivakumar, who is currently lodged in the jail under judicial custody in connection with a money laundering case. pic.twitter.com/nnooXs5gHv

HD Kumaraswamy
meets
DK Shivakumar
Tihar jail
Karnataka News

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు