ఎగ్జిట్ పోల్స్ : హర్యానాలో కూడా బీజేపీదే అధికారం

Submitted on 21 October 2019
Haryana exit poll result 2019: Poll of polls predicts landslide victory for BJP

హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం...90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశముందని తేల్చాయి. అటు మహారాష్ట్రలో కూడా శివసేన-బీజేపీ కూటమిదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

మొత్తానికి రెండు రాష్ర్టాల్లో బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికతో పాటుగా హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.
 

Victory
BJP
haryana
Assembly Election
win
exit polls

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు