రాహుల్‍‌కు రాజ్‌నాథ్ కౌంటర్: ఓం అని రాయకపోతే ఏం చేయాలి

Submitted on 17 October 2019
Haryana elections 2019: ‘If not Om, then what?’: Rajnath Singh jabs Rahul Gandhi on Rafale ‘shastra puja’

డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. దసరా పండుగ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి అందుకుని పూజలు చేశారు. ఇందులో భాగంగానే చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి, విమానంపై ఓం అని రాశారు. 

దీనిపై రాజకీయ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన రాజ్‌నాథ్ వీటిపై స్పందించారు. 'నేను యుద్ధ విమానంపై ఓం అని రాశాను. ప్రజలంతా ఎందుకు రాశావని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఒకటి అడుగుదామనుకుంటున్నా. యుద్ధ విమానంపై ఓం అని రాయకుంటే మరింకేం రాయమంటారో చెప్పండి' అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో డిఫెన్స్ మినిష్టర్ పారిస్ నుంచి తొలి యుద్ధ విమానాన్ని రిసీవ్ చేసుకున్నారు. అన్ని కోట్ల ప్రాజెక్టు విషయంలో వారు అవమానంగా భావిస్తున్నారు. లేదంటే ఫ్రాన్స్ కు వెళ్లి తీసుకోవాల్సిన విమానాన్ని పుణెలో ఎందుకు తీసుకున్నారు' అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. 

Haryana elections
rajnath singh
Rahul gandhi
Rafale
shastra puja

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు