హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : ఫలితంపై ఉత్కంఠ

Submitted on 24 October 2019
Haryana Assembly 2019 election results today

హర్యానాలో ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నామోడీ చరిష్మానే బీజేపీ నమ్మకుంది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి పీఠం తమదే అన్న ధీమాలో బీజేపీ లీడర్లు ఉన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జరగగా..కాంగ్రెస్, బీజేపీ అన్ని సీట్లకీ పోటీపడ్డాయ్. ఈ చిన్న రాష్ట్రంలో కోటి ఎనభై మూడు లక్షల మంది ఓటర్లు ఉండగా..ఎన్నికల బరిలో 1169మంది అభ్యర్ధులు తమ లక్ టెస్ట్ చేసుకున్నారు.

పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,357 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చిన్నరాష్ట్రమైనా ఇంతమంది అభ్యర్ధులు పోటీ పడటంతో..ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉత్కంఠ నెలకొననుంది. భారీ భద్రత మధ్య కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయ్. 

ఎగ్జిట్ పోల్స్‌ని కనుక గమనిస్తే
> టైమ్స్‌నౌ బిజెపికి 71 సీట్లు వస్తాయని అంచనా వేసింది..కాంగ్రెస్‌కి 11, ఇతర పార్టీలకు 8 సీట్లు వస్తాయని చెప్పింది టైమ్స్ నౌ.
> మరో సర్వే జన్‌కీ బాత్ సర్వే ప్రకారం ..బిజెపికి 52 నుంచి 63, కాంగ్రెస్‌కి 15 నుంచి 19 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఇతరులు ఒక్కచోటే గెలిచే అవకాశముందని జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్ చెప్పింది
> ఇండియా న్యూస్ కూడా బిజెపి కూటమికి 75 నుంచి 80 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.కాంగ్రెస్ కేవలం 9 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుచుకోగలదని చెప్పింది..ఇతరులు ఒక సీటు నుంచి మూడు సీట్లలో గెలిచే అవకాశముందని ఇండియా న్యూస్ సర్వే చెప్తోంది. మరో నేషనల్ సర్వే న్యూస్ ఎక్స్..హర్యానాలో ఇదే రకమైన అంచనాలను వెలువరించింది. 
> రిపబ్లిక్ టీవి ఎగ్జిట్ పోల్ మాత్రం బిజెపికి 52 నుంచి 63 సీట్లను, కాంగ్రెస్‌కి 15 నుంచి 19, ఇతరులు 12 నుంచి 18 వరకూ సీట్లను గెలుచుకుంటారని అంచనా వేసింది. 
Read More : మహారాష్ట్రలో ఓటరు తీర్పు ఎటువైపు

haryana
Assembly
Election
results
Today

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు