happy to release this song from Solo Brathuke So Better Actor Nithin Twitter

పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా..తేజ్ కు నితిన్ ఫన్నీ కామెంట్స్ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పెళ్లి చేసుకోకుండా..ఎన్ని రోజులు ఉంటావో చూస్తా..కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో గాని..చేసుకోవడం మాత్రం పక్కా అంటూ సాయి ధరమ్ తేజ్ ను ఉద్దేశించి నటుడు నితిన్ ఫన్నీ కామెంట్స్ పెట్టాడు. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్..ట్రెండ్ సెట్ చేస్తా..అంటూ సరదాగా బదులిచ్చాడు. మింగిల్ అయినా..మా లాంటి సింగిల్స్ కోసం ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. 

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’..న్యూ ఫిల్మ్ సాంగ్ ను నటుడు నితిన్ రిలీజ్ చేశారు. సినిమా నుంచి సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉందని నితిన్ వెల్లడించారు. నో పెళ్లి..దాని తల్లి..ఈ తప్పే చేయకురా వెళ్లి..అంటూ ఉన్న సాంగ్ అభిమానులను అలరిస్తోంది. పెళ్లి అంటే ఆమడదూరం పారిపోయే వ్యక్తి పాత్రలో తేజ్ నటిస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయికి తోడుగా..వరుణ్ తేజ కూడా సాంగ్ లో కనిపించాడు. 
సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా…థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

 

Read: నో పెళ్లి..దాని తల్లి : సోలో బ్రతుకే సో బెటర్ న్యూ సాంగ్