ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హతం : ధృవీకరించిన ట్రంప్

Submitted on 14 September 2019
Hamzabin Laden, son of Osamabin Laden killed

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ ను అమెరికా భద్రతా దళాలు హతమార్చాయి. ఆఫ్గానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హతమార్చినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. హంజాబిన్ లాడెన్ మృతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించాడు. ఈమేరకు శనివారం (సెప్టెంబర్ 14, 2019) వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హంజాబిన్ కోసం రెండేళ్లుగా అమెరికా భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. అతని తలపై ఒక మిలియన్ డాలర్ల నజరానా ఉంది. అల్ ఖైదాలో హంజాబిన్ లాడెన్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ఈక్రమంలో అమెరికా భద్రతా దళాలు అతన్ని హత మార్చాయి. 

గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా జరిపిన దాడుల్లో హంజాబిన్ హతమైనట్లు అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించినప్పటికీ, అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ప్రస్తుతం వైట్ హౌస్ ఈ ప్రకటన విడుదల చేసింది. హంజాబిన్ మృతితో అల్ ఖైదా గ్రూప్ కార్యకలాపాలు తగ్గిపోనున్నాయని, ఈ సంస్థ నిర్వీర్యం అవ్వడం ఖాయమని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఒసామాబిన్ లాడెన్ మూడో భార్య కుమారుడు హంజాబిన్ లాడెన్. ఒసామాబిన్ లాడెన్ ను చంపింది అమెరికానే కాబట్టి...ఐఎస్ ఐ సహకారంతో అమెరికాలో దాడులు చేస్తానని గతంలో హంజాబిన్ లాడెన్ ప్రకటించినట్లుగా అమెరికా వర్గాలకు సమాచారం అందింది. అతన్ని హతమార్చేందుకు సెక్యూరిటీ వింగ్స్ ద్వారా సమాచారం తెలుసుకుని ఆఫ్గానిస్తాన్ లో హతమార్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను ఇవాళ విడుదల చేశారు.
 

Hanzabin Laden
kill
america security forces
Afghanistan-Pakistan border

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు