ఫస్ట్ డే కలెక్షన్స్

Submitted on 15 February 2019
Gully Boy First Day Collections-10TV

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా, జోయా అక్తర్ డైరెక్షన్‌లో రూపొందిన మూవీ.. గల్లీబాయ్.. అప్నా టైమ్ ఆయేగా అనేది ట్యాగ్‌లైన్. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాణీ, జోయా అక్తర్ నిర్మాతలు. లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14 న సినిమా రిలీజైంది.  ముంబైలోని మురికివాడలో నివసించే ఒక కుర్రాడికి పెద్ద ర్యాపర్ కావాలనే కోరిక.. తన టాలెంట్‌తో సంగీత ప్రపంచంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాడు అనే పాయింట్‌తో తెరకెక్కిన గల్లీబాయ్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,500 స్క్రీన్స్‌లో రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా.. రూ. 18.70 కోట్లు కలెక్ట్ చేసింది.. 2018 డిసెంబర్‌లో సింబాతో సూపర్ హిట్ కొట్టిన రణ్‌వీర్, 2019 లో గల్లీబాయ్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌కి చక్కటి ప్రారంభాన్నిచ్చాడు. 

వాచ్ గల్లీబాయ్ ట్రైలర్...

Gully Boy
Ranveer Singh
Alia Bhatt
Zoya Akhtar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు