రికార్డు స్థాయిలో...లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

Submitted on 1 December 2019
GST Collection At Rs 1.03 Lakh Crore In November: Finance Ministry

ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

2017 జులైలో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇవి మూడో అత్యధిక వసూళ్లుగా నమోదయ్యాయి.  కాగా జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి పన్ను వసూళ్లు రూ లక్ష కోట్లు దాటడం​ ఇది ఎనిమిదివసారి కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 95,880 కోట్లు కాగా, గత ఏడాది ఇదే (నవంబర్‌)నెలలో జీఎస్టీ వసూళ్లు రూ 97,637 కోట్లుగా నమోదయ్యాయి.

gst
Collection
india
record
1.03LAKH
NOVEMBER
FINANCE MINISTERY

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు