తాడేపల్లికి సీఎం జగన్ : అధికారులతో అత్యవసర మీటింగ్

Submitted on 24 August 2019
Grand welcome to YS Jagan America Tour End

ఏపీ సీఎం జగన్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆగస్టు 24వ తేదీ శనివారం ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముఖ్య అధికారులతో అత్యవసర మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో క్యాంప్‌ ఆఫీసులో జరుగనుంది. చీఫ్ సెక్రటరీ, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు జగన్. పోలవరం రీ టెండర్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఏపీ అమరావతి రాజధాని జరుగుతున్న చర్చ, వరదలు, ముంపు ప్రాంతాల పరిస్థితి ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. 

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఇతరులు సాదర స్వాగతం పలికారు. వెల్ కం ప్ల కార్డులతో వైసీపీ కార్యకర్తలు హాజరయ్యాయి. 
ఆగస్టు 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి వారం రోజులు అమెరికాలో పర్యటించారు. 

ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులు పెట్టే వారికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు సీఎం జగన్. అమెరికా విదేశాంగ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. వాషింగ్టన్‌లో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక మీటింగ్ హాజరై భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు.

పరిశ్రమలకు అవసరమైన భూమి, కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఆగస్టు 17న డల్లాస్‌లో పర్యటించారు. ఆగస్టు 18న వాషింగ్టన్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నారు. ఆగస్టు 22 మధ్యాహ్నం షికాగోలో కొన్ని సంస్థల ప్రతినిధులను కలుసుకున్నారు. అదే రోజు రాత్రి అమెరికా నుంచి పయనమయ్యారు సీఎం జగన్. 

Grand
welcome
Ys Jagan
America Tour End

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు