పద్దతిగా రావాలి : ప్రభుత్వ ఉద్యోగులకు డ్రస్ కోడ్

Submitted on 12 June 2019
govt staff from wearing colourful t-shirts, jeans Bijapur collector Orders Chattisgarh

ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫాం నిబంధన అమలు చేస్తున్నారు.. స్కూల్ పిల్లలు లాగే అందరూ ఒకే డ్రస్ లో రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడా అంటారా.. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో. కలెక్టర్ ఆదేశాలతో షాక్ అయిన ఉద్యోగులు.. కొన్ని సడలింపులు కోరారు. డ్రస్ కోడ్ అయితే మాత్రం కచ్చితమని ఆదేశాలు ఇవ్వటం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఆఫీసులకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కలెక్టర్. ఆఫీసులకు ఫార్మల్స్ లో మాత్రమే రావాలని సూచించారాయన. కలెక్టర్ కేడీ కుంజమ్ ఆదేశాలతో ఉద్యోగులు అందరూ కూడా కొత్త దుస్తుల కొనుగోలులో బిజీ అయ్యారు. ఆఫీసుల్లో డీసెంట్ గా కనిపించాలని కూడా కోరారు. గ్రూప్ 4 ఉద్యోగుల రెగ్యులర్ గానే యూనిఫాం ఉంది. అయితే వారు వాటిని ధరించటం లేదు. దీనికితోడు ప్రతి నెలా యూనిఫాం వాషింగ్ అలవెన్స్ కూడా తీసుకుంటున్నారు. అయినా డ్రస్ వేసుకోవటం లేదు. దీనిపైనా కలెక్టర్ సీరియస్ అయ్యారు. యూనిఫాం లేకుండా వస్తే ఆఫీసులోకి రానివ్వం అంటూ గ్రూప్ 4 ఎంప్లాయీస్ కూడా వార్నింగ్ ఇచ్చారు.

క్లాస్ 4 ఉద్యోగులు యూనిఫాంలోను..మిగిలిన ఉద్యోగులు సాధారణ డ్రెస్సుల్లో మాత్రమే డ్యూటీలకు రావాలని కలెక్టరు జారీ చేసిన అదేశాల్లో ఉన్నాయి. కలెక్టర్ చేసిన ఈ కొత్త ఆదేశాలపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు.
 

govt staff
wearing
colourfu
l t-shirts
jeans
Bijapur collector
kanjam
Orders
Chattisgarh

మరిన్ని వార్తలు