డ్రగ్స్ కంటే డేంజర్ : ఇండియాలో ఈ-సిగరేట్లు బ్యాన్! 

Submitted on 3 July 2019
Govt decides to ban e-cigarettes; labelled them as drugs

ఇండియాలో ఈ-సిగరేట్లను నిషేధించనున్నారు. దేశంలో ఈ-సిగరేట్లు పీల్చేందుకు వాడే ఎలక్ట్రానిక్ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్స్ (ENDS)సాధనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సిగరేట్ల నిషేధంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో ఓ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ సిగరేట్లలో డ్రగ్స్ వంటి హానికర కారకాలు ఉన్నాయని, వీటిని పీల్చడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి 100 రోజుల అజెండాలో భాగంగా బ్యాటరీ ఆపరేటింగ్ ప్రొడక్టులైన ఈ సిగరేట్లపై బ్యాన్ విధించడం ఒక ప్రతిపాదనగా ఉంది. ఈ సిగరేట్లను ఇండియాలోకి ఒక ప్రొడక్టుగానే మార్కెటింగ్ చేసుకున్నారు. స్మోకింగ్‌కు బాగా అలవాటైన వారిని మాన్పిస్తామని చెప్పి లైసెన్స్ లేని ఉత్పత్తులను అక్రమంగా దేశంలోకి ప్రవేశపెట్టేసింది. దేశంలోకి ప్రవేశించిన కొద్దికాలంనే  ఈ-సిగరేట్లు ఎంతో పాపులర్ అయ్యాయి. టీనేజర్లు ఎక్కువగా ఈ-సిగరేట్లకు బానిసలుగా మారారు. 

ఈ సిగరేట్లకు యువత ఫిదా :
చూసేందుకు ఎంతో స్టయిలిష్ గా ఉండే ఈ-సిగరేట్.. తాగితే ఆ ఫీల్.. ఆ కిక్కే వేరు అనేవారు చాలామంది. సాధారణ సిగరెట్‌ కంటే ఈ-సిగరేట్.. ఎంతో క్లాస్ గా ఉంటుంది. పండ్ల సువాసన కూడా వస్తుంది. రకరకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉండటంతో యువత ఈ-సిగరేట్లకు ఫిదా అవుతోంది. ఫలితంగా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. సాధారణ సిగరేట్కు.. ఈ-సిగరేట్కు ఒకటే తేడా.. దీనికి పొగ బయటకు రాదు. పొగ తాగినట్టు తొందరగా గుర్తించలేం. 

పొగాకు ఆకులు మండించాల్సిన అవసరం ఉండదు. కానీ, పోగాకులో ఉండే నికోటిన్.. ఇందులో లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ సిగరేట్ బ్యాటరీతో పనిచేస్తుంది. ద్రవరూపంలో ఉన్న నికోటిన్  మండించడం ద్వారా ఇది వర్క్ చేస్తుంది. ఈ-సిగరేట్ల తయారీ కంపెనీలపై నిషేధంతో పాటు దిగుమతి, విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు లైవ్ మింట్ రిపోర్టు తెలిపింది. 

ప్రభుత్వ డేటా ప్రకారం..
ఇండియాలో ఈ-సిగరేట్ల బ్రాండ్లు 460కు పైగా ఉన్నాయి. ఒక్కో బ్రాండ్ లో ఒక్కో రకమైన నికోటిన్ డెలివరీ కాన్ఫిగరేషన్, 7వేల 700 ఫ్లేవర్లలో లభిస్తున్నాయి. సిగరేట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్  కింద ఈ ప్రొడక్టుపై నిషేధం విధించడం కుదరలేదు. ఈ చట్టంలో మార్పు తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ-సిగరేట్ల వాడకంపై ఎందరో నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సెక్షన్ 3(B) డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 (DCA) కింద ఈ-సిగరేట్లు సహా ఇతర ఉత్పుత్తులను డ్రగ్స్ గా అభివర్ణించారు. సెక్షన్ 26(A) ఆఫ్ DCA కింద ఈ-సిగరేట్లను బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సిగరేట్లలోని నికోటిన్ ద్రావణాన్ని మండించినప్పుడు ఆవిరి బయటకు వస్తుంది. అది పీల్చగానే ఒకరకమైన మత్తుతో కూడిన ఫీల్ కలుగుతుంది. ఈ–సిగరెట్లకు చాలా పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్‌ పెన్స్, ఎలక్ట్రానిక్‌ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్స్‌ అని కూడా పిలుస్తారు. 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం : 
సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, డెంటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ–సిగరెట్లను 36 దేశాల వరకు నిషేధం విధించాయి. భారత్ లో పంజాబ్, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్‌ జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, రాష్ట్రాలు నిషేధించాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సిగరేట్లపై నిషేధం విధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు సంస్థలు విన్నవించాయి.

e-cigarettes ban
Drugs
health ministry
ends
Modi Government
nicotine solution


మరిన్ని వార్తలు