గూగుల్ సెర్చ్‌ అప్‌డేట్ : య్యూటూబ్ వీడియోల్లో Timestamps హైలెట్

Submitted on 19 September 2019
Google will highlight important parts of videos in search results

ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్  కొత్త అప్ డేట్ రిలీజ్ చేసింది. వీడియో సెర్చ్ రిజల్ట్స్ పేజీని అప్‌డేట్ చేసింది. సెర్చ్ రిజల్ట్స్ పేజీపై రిలేటెడ్ వీడియో లిస్టింగ్ కు బదులుగా లాంగ్ వీడియోలో అవసరమైన భాగాన్ని హైలెట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. సాధారణంగా వీడియో క్రియేటర్లు సెట్ చేసే టైమ్ స్టాంప్స్ ఆధారంగా ఎక్కువ సమయం నిడివి ఉన్న వీడియోలపై ఈ ఆప్షన్ హైలెట్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి How to వీడియోలు లేదా డాక్యుమెంటరీ వీడియోలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉదాహరణకు.. ఏదైనా ఒక సినిమాకు సంబంధించిన లాంగ్ వీడియోలో నచ్చిన సాంగ్ లేదా డైలాగ్.. సీన్ చూడాలనుకుంటే.. ఏం చేస్తాం.. ఫార్వార్డ్ చేస్తుంటాం. అలా చేయాల్సిన అవసరం లేకుండానే సెర్చ్ రిజల్ట్స్ లో వీడియోలోని పార్టులకు సంబంధించి డైరెక్ట్ లింక్స్ కనిపిస్తాయి. ఆ లింకులపై క్లిక్ చేస్తే చాలు.. వీడియోలో మీరు చూడాలనుకున్నపార్ట్ టైమ్ స్టాంప్స్ భాగానికి తీసుకెళ్తుంది. పదేపదే వీడియో స్కిప్ చేయాల్సిన పని ఉండదు. ఈజీగా వీడియోలో నచ్చిన భాగాన్ని నేరుగా వీక్షించవచ్చు.   

‘వీడియోలను టెక్స్ట్ మాదిరిగా ఒకేసారి పూర్తిగా చూడలేం. అంటే.. వీడియో కంటెంట్‌ను చూసి చూడనట్టు మాత్రమే స్కిప్ చేయగలం’ అని గూగుల్ సెర్చ్ ప్రొడక్టు మేనేజర్ ప్రశాంత్ బహేటి తెలిపారు. గూగుల్ సెర్చ్ పేజీలో ఇతర సమాచారాన్ని మరింత సులభంగా యాక్సస్ చేసుకునే విధానంపై తాము వర్క్ చేస్తున్నామన్నారు. సెర్చ్ లో వీడియో కంటెంట్ ను అందరికి ప్రయోజనకరంగా ఉండేలా ఆర్గనైజ్ చేయడం, అర్థం చేసుకునేందుకు కొత్త మార్గాలను డెవలప్ చేస్తున్నామని ప్రశాంత్ చెప్పారు. వీడియోలోని వివిధ భాగాలను డైరెక్ట్ లింకులతో సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించేలా చేయవచ్చు. అక్కడ క్లిక్ చేస్తే చాలు.. వీడియోలో మీరు చూడాల్సిన కంటెంట్ భాగానికి తీసుకెళ్తుంది. ఈ కొత్త ఆప్షన్ వర్క్ చేయాలంటే.. ముందుగా కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో హైలెట్ చేయాల్సిన భాగాన్ని ప్రత్యేక సిగ్మంట్లను బుక్ మార్స్క్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్లాట్ ఫాం కావొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు. 

వాస్తవానికి.. ఇదొక యూట్యూబ్ క్రియేటర్స్ ఫీచర్ మాత్రమే కాదు.. అన్ని ప్లాట్ ఫాంలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఫీచర్ తో CBS స్పో్ర్ట్స్, NDTV వంటి పబ్లిషర్స్ తో వర్క్ జరుగుతోంది. త్వరలో తమ వీడియోలను మార్కింగ్ చేయడం ప్రారంభించనున్నాయి. వీడియోలను ఆటోమాటిక్‌గా మార్క్ అప్ చేయడానికి గూగుల్ తమ మిషన్ లెర్నింగ్ విషయంలో మ్యాజిక్ చేయకపోవడం కాస్త ఆశ్చర్యానికి కలిగించే విషయమే.

వీడియో ఇండెక్సింగ్ ప్రారంభంలో యూట్యూబ్ వీడియోలకు ఇంగ్లీష్ సెర్చ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరోవైపు.. వీడియో డిస్ర్కిప్షన్ లో టైమ్ స్టాంప్స్ యాడ్ చేసేలా వీడియో క్రియేటర్లను గూగుల్ ప్రోత్సహిస్తోంది. వీడియో డిస్ర్కప్షన్లలో టైమ్‌స్టాంప్‌లపై కేవలం గూగుల్ ఆధారపడటం లేదు. నిర్మాణాత్మక డేటాను స్కిప్ చేసిన వీడియోలకు జోడించడానికి కొంతమంది ప్రొవైడర్లను గూగుల్ ఆహ్వానిస్తోంది. 

google
highlight
important parts
videos
search results

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు