ప్రమాదాన్ని పసిగట్టేస్తుంది : ఆటోమాటిక్ Car Crash డిటెక్షన్ ఫీచర్

Submitted on 13 May 2019
Google Spotted Testing Automatic Car Crash Detection in Android Q

హైవేపై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఎదురుగా మరో వాహనం దూసుకోస్తోంది. కట్ చేస్తే.. రెండు కార్లు ఢీకొనలేదు. కారణం.. అందులో ఒక కారులో ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టే యాప్ టెక్నాలజీ ఉంది. అదే.. ఆటోమాటిక్ కారు క్రాష్ డిటెక్షన్ యాప్. ఈ సరికొత్త టెక్నాలజీని ‘సేఫ్టీ హబ్’అని కూడా పిలుస్తారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కాదు. కేవలం గూగుల్ ఫిక్సల్ ఫోన్లలో మాత్రమే రానుంది.

ఆండ్రాయిడ్ క్యూ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)పై పనిచేసే ఫిక్సల్ ఫోన్లలో ఈ యాప్ టెక్నాలజీ ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతానికి ఈ ఆటోమాటిక్ కారు క్రాష్ డిటెక్షన్ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. గూగుల్ ఈ టెక్నాలజీ యాప్ ను టెస్టింగ్ చేస్తున్నట్టు ఎక్స్ డీఏ డెవలపర్స్ రిపోర్ట్స్ తెలిపాయి. ఆండ్రాయిడ్ క్యూ బీటా 3 ఫీచర్లు కలిగిన కొత్త గూగుల్ యాప్ సేఫ్టీ హబ్ ప్యాకేజీ పేరు.. com.google.android.apps.safetyhub అని కోడ్ రాసి ఉంటుంది.

యాప్ లోని కోడ్ స్ట్రింగ్స్ ఆటోమాటిక్ కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఫంక్షనాలిటీగా చెప్పవచ్చు. ఫిక్సల్ ఎక్స్ క్లూజీవ్ ఫంక్షనాలిటీ తో యాప్ పనిచేస్తుంది. ఆటోమాటిక్ డిటెక్షన్ ద్వారా కారును ప్రమాదానికి ముందుగానే కచ్చితంగా ఎలా కంట్రోల్ చేస్తుంది.. అదేలా సాధ్యమనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. టెక్ దిగ్గజం గూగుల్.. డేటా ద్వారా యాక్సలెరో మీటర్, మైక్రోఫోన్ నుంచి కంట్రోల్ చేస్తుంది. క్రాష్ డిటెక్షన్ కు సంబంధించి ఫుల్ ఫ్రూప్ ఇవ్వలేకపోవచ్చునని నివేదిక తెలిపింది.

ఒకసారి క్రాష్ డిటెక్ట్ చేస్తే ఏమౌతుంది అనేదానిని స్ట్రింగ్స్ రివీల్ చేయలేదు. ఈ యాప్.. ఫోన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లిస్ట్ లేదా ఫస్ట్ రిస్పాండర్లను అప్రమత్తం చేస్తుందని భావిస్తున్నారు. ఫ్యూచర్ క్యూ బీటా వెర్షన్... ఈ సరికొత్త యాప్ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుందో దానిపై మరింత సమాచారాన్ని రివీల్ చేస్తుందని ఆశిస్తున్నట్టు నివేదిక తెలిపింది. 

google
Automatic Car
Crash Detection
Android Q
safety hub 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు