కొలనులో కారు.. డెడ్ బాడీ అతడిదే : 22ఏళ్ల మిస్టరీని ఛేదించిన గూగుల్ ఎర్త్

Submitted on 13 September 2019
Google Earth Helps Solve The Mystery Of A Decades Old Disappearance

ఆ రోజు రాత్రి నైట్ క్లబులో ఫుల్ గా తాగేశాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అతడి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. తాగిన మైకంలోనే ఇంటికి బయల్దేరానంటూ చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి రాలేదు.. అదృశ్యమైయ్యాడు. ఏమయ్యాడో తెలియదు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. అప్పట్లో అతడు మిస్సింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అతడే విలియం ఎర్ల్ మోల్డట్ (40). 1997 నవంబర్‌లో అదృశ్యమైన విలియం ఆచూకీ ఎవరికి తెలియలేదు.

అప్పుడప్పుడు మాత్రమే మద్యం సేవించే విలియం.. ఆ రోజు బాగా తాగేశాడు. కారులో ఇంటికి బయల్దేరిన అతడు కనిపించకుండా పోయాడు. ఫ్లోరిడాలోని లాంటనా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత విలియం మిస్సింగ్ మిస్టరీ వీడింది. కానీ, అతడు జీవించి లేడు.

గూగుల్ ఎర్త్ శాటిలైట్ సెర్చ్ చేస్తుండగా 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం అవశేషాలు, కారు మూన్ బే సర్కిల్ కొలనులో కనిపించాయి. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫొటో ఆధారంగా ఆ మృతదేహం విలియందేనని గుర్తించినట్టు పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ ఆఫీసు ఒక ప్రకటనలో తెలిపింది. 2007లో గూగుల్ ఎర్త్ శాటిలైట్ తీసిన ఫొటోలో ఆ ప్రాంతం కనిపించింది.

అందులో నీటిలో మునిగిన కారు ఉంది. 2019 వరకు ఎవరూ ఆ ఫొటోను గుర్తించలేదు. చార్లే ప్రాజెక్టులో భాగంగా అదృశ్యమైన వ్యక్తుల కోసం గూగుల్ ఎర్త్ లో సెర్చ్ చేస్తుండగా ప్రాపర్టీ సర్వేయర్ అనే వ్యక్తికి ఆ ఫొటో కనిపించింది. ఆ డేటా బేస్‌లో విలియం అదృశ్యమైన విషయాన్ని గుర్తించాడు.

మునిగిన కారు ఎవరిదో గుర్తించేందుకు పామ్ బీచ్ పోస్టు సంబంధిత అధికారులకు రిపోర్టు చేసింది. లాంటనా, వెల్లింగ్టన్ ప్రాంతానికి 20మైళ్ల దూరంలో ఉన్న కొలను ప్రాంతాన్ని ముందుగా ఓ డ్రోన్ సాయంతో అధికారులు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టు 28న కారుతో పాటు విలియం మృతదేహాన్ని గుర్తించారు.

నీటిలో నుంచి కారును వెలికి తీశారు. విలియం అవశేషాలను వైద్యపరీక్షల కోసం కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి పంపారు. విలియం, అతడి కారు ఎలా కొలనులో పడిందో స్పష్టత లేదు. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ ప్రమదవశాత్తూ అదుపు తప్పి కొలనులో పడిందా? లేదా అసలు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.

Google Earth
 Mystery Decades
Disappearance
satellite map
William Earl Moldt

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు