వాట్సాప్ గుడ్ ఆప్షన్: ఇకపై మీ పర్మిషన్ మస్ట్

Submitted on 16 February 2019
Good News, New Feature From WhatsApp

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా యూజర్లకు భారీ ఊరట లభించనుంది.  వాట్సాప్ గ్రూప్స్ గోల తప్పనుంది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటే... ఇకపై ఎవరుపడితే వాళ్లు వాట్సప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయడానికి కుదరదు. ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలంటే  ముందుగా మీ పర్మిషన్ తప్పనిసరి.

 

ఈ కొత్త ఫీచర్ పేరు గ్రూప్ ఇన్విటేషన్. దీని ప్రకారం మన అనుమతి లేకుండా మన నెంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేందుకు అడ్మిన్‌కు వీలుండదు. ఏదైనా గ్రూపులో చేరాలా? వద్దా? అనే  నిర్ణయం వాట్సాప్‌ యూజర్ల చేతుల్లోనే ఉంటుంది. తమను గ్రూప్స్‌లో ఎవరు జోడించవచ్చో స్వయంగా యూజర్లే ఎంచుకోవడానికి అనుమతించే ఫీచర్‌ ఇది. దీని ప్రకారం ప్రైవసీ సెటింగ్స్‌లో 3  ఆప్షన్లు ఉంటాయి.

WhatsApp Settings > Account > Privacy > Groups సెక్షన్‌లో Everyone, My Contacts, Nobody అని కనిపిస్తాయి.

1. ఎవ్రీవన్‌ : అంటే యూజర్‌ పరిచయం లేకపోయినా, కాంటాక్ట్స్‌లో లేకపోయినా గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినివ్వడం.
2. మై కాంటాక్ట్స్‌ : కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్‌ చేసేందుకు పర్మిషన్
3. నోబడీ : ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో జోడించే అవకాశం ఉండదు

 

నోబడీ ఆప్షన్ ఎంచుకున్న వారికి.. గ్రూప్ అడ్మిన్ తమ వాట్సప్‌ గ్రూప్‌లో చేరాలంటూ గ్రూప్ ఇన్విటేషన్ పంపించాల్సి ఉంటుంది. ఆ ఇన్విటేషన్ 72 గంటలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. మీరు  ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్ అడ్మిన్ మిమ్మల్ని తన గ్రూప్‌లో యాడ్ చేయడానికి అవకాశముంటుంది. ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్ బెటా వెర్షన్‌లో గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ టెస్టింగ్ దశలో  ఉంది. త్వరలోనే యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.

 

వాట్సప్ గ్రూప్స్.. యూజర్లకు పెద్ద సమస్యగా మారాయి. ఒకసారి గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయితే ఏమనుకుంటారో అని ఆలోచించాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యల్లో  గ్రూపుల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై మాత్రం అలాంటి బాధలు ఉండవు.

Read Also : వాట్సాప్ వెబ్ తరహాలో: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

Read Also : PUBGలో కొత్త మోడ్: ఫిబ్రవరి 19న అందుబాటులోకి..

whats app new feature
soon
you cannot be added to WhatsApp Groups
without permission
whats app groups
admin
permission
Facebook

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు