భారీగా పడిపోయిన బంగారం ధర!

Submitted on 8 November 2019
Gold Rate Today: Gold, silver edge lower on rise in risk appetite

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కసారిగా క్షీణించింది. భారత్‌ కాలమానం ప్రకారం గురువారం రాత్రికి భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌–నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా-చైనా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయనే ఊహాగానాలు పసిడి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమన్నది విశ్లేషణ. 

సహజంగా భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాస్తవ వృద్ధికి దోహదపడే అసెట్స్‌వైపు తమ ఇన్వెస్ట్‌మెంట్లను మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం రాత్రి ఇదే విధంగా బలహీనంగా ముగిస్తే, భారత్‌ దేశీయ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. 

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో మార్పు కనిపించలేదు. రూ.39,900 వద్దనే ఉండిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో ధర రూ.36,580 వద్దనే కొనసాగింది. అయితే పసిడి ధర 3 రోజుల్లో రూ.510 మేర దిగొచ్చింది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.250 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది.

Gold Rate Today
gold
silver
rise
Gold Rate

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు