బాబోయ్ బంగారం : రికార్డు స్థాయికి ధరలు

Submitted on 23 July 2019
Gold prices hit all-time high, silver rates surge

బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధర గరిష్ట స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.35వేల 970దగ్గర ట్రేడ్ అవుతోంది. సోమవారం(జూల్ 22,2019) నాటి కొనుగోళ్లలో బంగారం ధరలో రూ.100 పెరుగుదల నమోదైంది. 10గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో పాటు, ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా బంగారం ధర పెరగడానికి కారణమం అంటున్నారు.

వెండి కూడా బంగారం బాటలోనే వెళ్తుతోంది. కిలో వెండి రూ.41వేల 960గా ఉంది. గతవారంతో పోలిస్తే వెండి ధరలో రూ.260పెంపు నమోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చుక్కలను తాకుతున్నాయి. దీంతో జనాలు పరేషాన్ అవుతున్నారు. పసిడి ధరలు పేద, మధ్య తరగతి వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇంత రేట్లు ఉంటే బంగారం కొనగలమా అని వాపోతున్నారు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్ వంటి పలు అంశాలు పుత్తడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు తెలిపారు.

gold
prices
high
hit
all time high
record
jewellery

మరిన్ని వార్తలు