The gods have more anger..Nagababu tweet on corona virus

‘దేవుళ్లకు కోపం ఎక్కువే సుమా’..కరోనాపై నాగబాబు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనాపై ప్రముఖ సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్‌ని భూమి మీదకు దేవుడే పంపించాడని కొన్ని మతాల పెద్దలు అంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా.. అంటూ సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ పై నెటిజన్లు తమకు తోచినట్లుగా అంటున్నారు. నాగబాబుని కొందరు విమర్శిస్తే.. మరికొందరు నాగబాబుకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.  

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తునన కరోనాపై ఆయా దేశాలు..రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్నారు.ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తూ దేశాలకు దేశాల్నే చుట్టేస్తోంది కరోనా. ఇప్పటి వరకూ కరోనా 139 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 5,417 మంది ఈ మహమ్మారికి బలైపోయారు.మరెందరో కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. 

See Also | కరోనా ఎఫెక్ట్ : సామూహిక సంబురాలకు దూరం…బార్లు, రెస్టారెంట్లు వెలవెల

Related Posts