గోదావరి బోటు ప్రమాదం : హాసిని క్షేమంగా రావాలని ప్రార్థనలు

Submitted on 16 September 2019
godavari boat accident, prayers for hasini

గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత భర్త సుబ్రమణ్యం, కుమార్తె హాసిని(12) నీటిలో గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోటు ప్రమాదంతో మధులత కుటుంబం చిన్నాభిన్నమైంది. తన తండ్రి అస్తికలు గోదావరిలో కలిపేందుకు సుబ్రమణ్యం.. భార్య, కూతురితో తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్లారు. ఊహించని విధంగా బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. దీంతో భార్య మధులత బోరున విలపిస్తున్నారు.

కుమార్తె హాసిని పుట్టిన రోజుని ఇటీవలే తల్లిదండ్రులు గ్రాండ్ గా చేశారు. పాప పుట్టిన రోజు వేడుకల వీడియోని చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. తన కూతురు ఆచూకీ కనిపెట్టాలని మధులత అధికారులను వేడుకుంటోంది. మే 10న హాసిని పుట్టిన రోజు. గ్రాండ్ గా వేడుకలు చేశారు. బర్త్ డే వేడుకలకు సంబంధించి వీడియో తీశారు. సుబ్రమణ్యం, మధులత దంపతుల కూతురు హాసిని.. తిరుపతిలోని స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది.

రెండో శనివారం కావడంతో స్కూల్ పిల్లలు తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ కి వెళ్లాల్సి ఉంది. తాను కూడా జూ పార్క్ కి వెళ్తాను అని హాసిని తల్లిదండ్రులతో చెప్పింది. మీ వెంట రాజమండ్రికి రాను అని మారం చేసింది. అయినా తండ్రి సుబ్రమణ్యం బలవంతంగా హాసినిని తీసుకెళ్లారు. చివరికి ఘోర బోటు ప్రమాదం జరిగింది. హాసిని కనిపించకుండా పోయింది. స్ప్రింగ్ డేల్ స్కూల్ లో విషాదచాయలు అలుముకున్నాయి. హాసిని కోసం పిల్లలు ప్రార్థనలు చేస్తున్నారు. హాసిని క్షేమంగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. హాసిని బాగా చదువుకునేదని టీచర్లు చెప్పారు. అందరితో సరదాగా ఉండేదన్నారు. హాసినిని గుర్తు చేసుకుని క్లాస్ మేట్స్ విలపిస్తున్నారు. కాగా, 3 నెలల క్రితమే సుబ్రమణ్యం తండ్రి చనిపోయారు.

godavari boat accident
hasini
Tirupati
safe
East Godavari
papikondalu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు