Glenn Maxwell Announces Engagement To Indian-Origin Girlfriend

ఇండియా అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన మ్యాక్స్ వెల్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అలవోకగా బంతులను బౌండరీలు దాటించి ఐపీఎల్‌లో ఇరగదీసిన స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ మ్యాక్స్ వెల్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పెళ్లి కూతురు ఎవరో కాదు.. మన ఇండియాకు చెందిన అమ్మాయే. ఐపీఎల్ నుంచి ఇండియాతో అనుబంధం పెనవేసుకున్న మ్యాక్స్ వెల్.. భారత సంతతి మహిళని పెళ్లి చేసుకోబోతున్నాడు. మెల్‌ బోర్న్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌(ఫార్మాసిస్ట్‌)ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు మ్యాక్స్ వెల్.

కొంతకాలంగా ఆమెతో ప్రేమలో ఉన్న మ్యాక్స్ ఇటీవల ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. కాబోయే భార్యతో దిగిన ఫొటోను పంచుకోగా.. ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి అని చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి మ్యాక్సీ తన ప్రేయసీతో కలిసి రాగా తొలిసారి వీరి విషయం ప్రపంచానికి తెలిసింది.

వినీ రామన్‌ను త్వరలో మ్యాక్సీ పెళ్లాడితే, భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా అతను నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లి చేసుకున్నాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ తర్వాతి కాలంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాక్సీని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.

See Also>>Copy-Paste చేస్తున్నారా? మీ కొంప ముంచుతుంది జాగ్రత్త..!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

?

A post shared by Glenn Maxwell (@gmaxi_32) on

Related Posts