GIC ప్లానింగ్ : రెండేళ్లలో 1.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు

Submitted on 20 May 2019
GICs may hire up to 1.5 lakh people in the next two years

వచ్చే రెండేళ్లలో 1.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్స్ (GICs) లక్షలాది మందికి ఇండియాలో ఉద్యోగాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ-బీపీఎం సెక్టార్ లో కీలక సెగ్మంట్ అయిన జీఐసీ.. గ్లోబల్ ఐటీ కార్పొరేషన్ ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. టీమ్ లీజ్ డేటా ప్రకారం.. క్యాపిటీవ్ యూనిట్స్ గ్లోబల్ ఐటీ కార్పొరేషన్స్ 2021 నాటికి భారతదేశంలో 1.5లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలను కల్పించనుంది.

గ్లోబల్ ఐటీ కార్పొరేషన్ కంపెనీలు.. తమ డిజిటల్ ల్యాండ్ స్కేప్ కోసం సొల్యుషన్స్ బుల్డ్ చేసుకునేందుకు.. ప్రత్యేకించి ఇండియాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. GIC సెంటర్లు.. కేపబులిటీ సెంటర్లగా.. డెలివరింగ్ R&D, ఎనలిటిక్స్, ఆటోమేషన్, ఐటీ మేనేజ్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ సర్వీసులపై ప్రధానంగా ఫోకస్ పెడుతుంటాయి. 

10లక్షల మార్క్ చేరడమే లక్ష్యంగా :
ఇండియాలో తమ పేరంట్ ఎంటర్ ప్రైజ్ కంపెనీలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్లేందుకు శక్తివంతమైన క్రియేటర్లుగా GIC సెంటర్లను అభివృద్ధి చేసినట్టు టీమ్ లీజ్ సహ వ్యవస్థాపకుడు రితూపర్ణ చక్రవర్తి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడంతో 14శాతం మేర వృద్ధి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ఆమె చెప్పారు. వ్యాపార వృద్ధి, ఉద్యోగుల వృద్ధి ఫిగర్లతో ఒకేలా ఉంటాయని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 2015 ఆర్థిక సంవత్సరంలో GIC టాలెంట్ సెంటర్ల ఏర్పాటుతో 7.45 లక్షల ఉద్యోగాలను సృష్టించగా.. 2019 ఆర్థిక సంవత్సరం నాటికి 10లక్షల మార్క్ ను చేరుకుంటామని అంచనా వేస్తోంది. 

తొలి ఆరు నెలల్లో 11.5 లక్షల ఉద్యోగాల అంచనా :
ఉద్యోగుల రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై కూడా జీఐసీ సెంటర్లు దృష్టి సారించాయి. ఉద్యోగుల నైపుణ్యాలకు తగినట్టుగా వారిని AI, Cloud కంప్యూటింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించినట్టు తెలిపింది. ఇండియాలో ఉద్యోగాల నష్టంపై నెగటివ్ సెంటిమెంట్ నెలకొన్న నేపథ్యంలో ఇటీవల టీమ్ లీజ్ ‘ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్’ పేరుతో మరో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్టులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో ఇండియాలో 11.5 లక్షల ఉద్యోగాలు యాడ్ అవుతాయని అంచనా వేసింది.

ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ పై చేసిన సర్వే ప్రకారం.. 19 ఐటీ రంగాల్లో.. 11 శాతం మాత్రమే నెట్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ పెరిగినట్టు తెలిపింది. ఇండియాలో 12వందల టెక్ ఫోకసడ్ GIC సెంటర్ల ద్వారా ఉద్యోగాలు పెరగనున్నాయి. టెక్ ఫోకసడ్ కంపెనీల జాబితాలో చిప్ మేకర్లు సహా టెక్సాస్ ఇనుస్ర్టూమెంట్స్ , ఇంటెల్, ఎఎండీ, క్వాల్ కామ్న్ ఉన్నాయి. ప్రపంచంలో 45శాతం గ్లోబల్ సెంటర్లు ఇండియా బయటవైపు నుంచే ఉంటాయని ఐటీ ఇండస్ట్రీ విభాగం నాస్కామ్ అంచనా వేస్తోంది. 

టాప్ 6 సిటీల్లో బెంగళూరు స్పెషల్ ఎట్రాక్షన్ :
నాస్కామ్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఒకరు మాట్లాడుతూ.. ‘ఇండియాలో టోటల్ టాలెంట్ బేస్ పై GIC సెంటర్లలో బెంగళూరు 50శాతం అతిపెద్ద షేర్ తో కొనసాగుతోంది. మరో కొల్లియర్స్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం.. వచ్చే మూడు ఏళ్లలో జీఐసీ లీజింగ్ యాక్టివిటీ కోసం.. 30-35 మిలియన్ల చదరపు మీటర్ల విస్తీర్ణంతో టాప్ 6 నగరాలైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్ సీఆర్, హైదరాబాద్, ముంబై, పుణెలో GIC సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

GIC లీజింగ్ యాక్టివిటీకి బెంగళూరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనా వేస్తోంది. కానీ, టెక్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మాత్రం ఢిల్లీ-ఎన్ సీఆర్ తో పాటు ఎనర్జీ, కెమికల్ కంపెనీలు ఉన్న ముంబై ప్రాంతాలను కూడా ఆప్షన్లుగా పరిశీలిస్తున్నట్టు రిపోర్ట్ తెలిపింది. 

GIC
1.5 lakh people
global in-house centres
IT-BPM sector
 global IT corporations

మరిన్ని వార్తలు