అలర్ట్ : నవంబర్ 30న GHMC పరిధిలో LRS మేళా

Submitted on 8 November 2019
GHMC to organise LRS Special mela on November 30th

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్  కార్యాలయాల్లో   నవంబర్  30న ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్‌ కేసులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ శుక్రవారం సమీక్ష జరిపారు.

భూ క్రమబద్దీకరణ పథకం దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక మేళా నిర్వహించనున్నట్లు కమీషనర్ తెలిపారు. 2016 డిసెంబర్‌ 31కి ముందు స్వీకరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తామన్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 85,291 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు అందాయని చెప్పారు.

వీటిలో 28,935 దరఖాస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్‌లు జారీచేసినట్లు చెప్పారు. 20,425 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. మరో 25,726 మందికి కావాల్సిన పత్రాలు జతపర్చాలని సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు.

Hyderabad
GHMC
lrs mela

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు