హాలీవుడ్‌కి హృతిక్ రోషన్: ప్రముఖ ఏజెన్సీతో ఒప్పందాలు

Submitted on 27 February 2020
Gersh Signs Hrithik Roshan; Agency To Help Indian Film Star Create Opportunities In Hollywood

ఇండియన్ సినిమాలో సుప్రీం స్టార్ అయిన గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. హాలీవుడ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇండియాలోని KWANతో పాటుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఏజెన్సీ గెర్ష్. బాలీవుడ్ సినిమాలను హాలీవుడ్ స్కీన్లపై డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న హృతిక్ ఒప్పందానికి ఓకే చెప్పింది. స్ట్రీమింగ్ సర్వీసుల్లో పెరిగిపోతున్న కాంపిటీషన్ దృష్టిలో ఉంచుకుని హృతిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

రాకేశ్ రోషన్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన హృతిక్ రోషన్ రెండు దశాబ్దాల కెరీర్లో 600మిలియన్ డాలర్లకు పైగా సంపాదించాడు. 9సార్లు ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన హృతిక్ 6సార్లు గెలుచుకున్నాడు. విదేశాల్లో బాలీవుడ్ సినిమా ప్రభావితం పెంచే స్టార్ కేటగిరీలో 2016వ సంవత్సరానికి గానూ మోస్ట్ ఫిలాంత్రోఫిక్ అనే ఘనత సొంతం చేసుకున్నాడు. UNICEFతో కలిసి పనిచేసి సుదీర్ఘమైన అభివృద్ధి లక్ష్యాల కోసం పని చేశాడు. 

అంతేకాదు, యూకే ఈస్టరన్ ఐ ప్రకారం.. దశాబ్దానికి సెక్సియెస్ట్ మేన్‌గానూ, ఫోర్బ్స్ జాబితాలో టాప్ 20మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ సెలబ్రిటీస్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఇతని గోల్ ఏంటంటే హాలీవుడ్‌లో ఇండియన్ ప్రాజెక్టు లాంచ్ చేయడమే. అక్కడ మార్కెట్ చేసుకోవడమే.

గత 20ఏళ్లుగా హృతిక్ రోషన్ ఇండియన్ సినిమాలో పలు ట్రెండ్స్ సృష్టించాడు. ఇక్కడ ప్రాజెక్టును విదేశాలకు తీసుకువెళ్లాలని ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. హృతిక్ నాయకత్వంలో లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రపంచంలో భారత్‌ను మంచి పొజిషన్ కు చేరుస్తాం. గెర్ష్‌తో కలిసి మంచి హాలీవుడ్‌లో అద్భుతాలు చేస్తామని ఆశిస్తున్నామని హృతిక్ రోషన్ మేనేజర్ అమృతా సేన్ అన్నారు. 

Gersh
Hrithik Roshan
india
Indian Film Star
opportunities
Hollywood

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు