నా వల్ల ‘గతం’ మర్చిపోయి.. నా ఇంటికే వచ్చారు..

Submitted on 22 February 2020
Gatham - Telugu Psychological Thriller Teaser

మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిప్రాయాలూ మారుతున్నాయి. కొత్తదనం, విభిన్న కథాంశాలతో కొత్తవారు రూపొందిస్తున్న సినిమాలకెప్పుడూ మంచి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అదే కోవలో ‘గతం’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వారిద్దరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారనే ఇంట్రెస్టింగ్ లైన్‌తో కిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు అడవి శేషు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

"జస్ట్ ఇమాజిన్.. లైఫ్ రీస్టార్ట్ అయితే''.. అంటూ ఆసక్తికరమైన మొదలైన ‘గతం’ టీజర్..  ఏ రిలేషన్ షిప్‌లోనైనా లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేది మెమెరీసే. కానీ మన మధ్య అవి చెరిగిపోయాయంటూ హీరో హీరోయిన్లు తమకున్న ప్రాబ్లమ్‌ను వ్యక్తం చేయడం చూస్తుంటే సినిమా ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఆఫ్‌బీట్ ఫిల్మ్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు నిర్మించారు.

పూర్తి స్థాయిలో అమెరికాలో మూడు నెలలపాటు ఎముకలు కొరికే చలిలో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల
ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రచన, దర్శకత్వం : కిరణ్ రెడ్డి
నిర్మాతలు : భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు
నేపథ్య సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
ఎడిటర్ : జి.ఎస్
స్టంట్ : డెన్నిస్ గర్
సౌండ్ డిజైన్ : డేవిడ్ డె లుకా.

Gatham
Psychological Thriller
teaser
Bhargava Poludasu
Rakesh Galebhe
Poojitha Kuraparthi
Sricharan Pakala
Off Beat Films
S Originals
Kiran Reddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు