వెల్లుల్లి ఒలవడం ఎలా : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో

Submitted on 19 June 2019
Garlic Peeling got 21 Million Views

వెల్లుల్లు వలవటం ఎలా.. ఎంత సింపుల్ గా వలవొచ్చు.. ఎలా వలుస్తారు.. ఈ ప్రశ్నలు వేస్తే అతన్ని వెటకారంగా.. ఎగాదిగా చూస్తాం. ఇంటర్నెట్ మాత్రం అలా చూడటం లేదు. సోషల్ మీడియా అయితే షేక్ అయ్యింది. అమ్మతోడు నిజం. వెల్లుల్లి వలుస్తున్న ఓ వీడియో వైరల్ గా మారింది. నాలుగు రోజుల్లోనే 3 కోట్ల మంది చూస్తే.. లక్షల సంఖ్యలో షేర్ అవుతూ.. ఇంటింటికీ చేరింది ఈ వీడియో. కొరియాలో తీసిన ఈ వెల్లుల్లి వలిచే వీడియో.. ఇప్పుడు ఇండియాలోనూ తన సత్తా చాటుతోంది.
ముందుగా ఆ వీడియో ఓ సారి చూడండీ..

విషయం లేకుండా ఏదీ వైరల్ కాదు.. వెల్లుల్లి ఒలవడం వైరల్ అవడం కాదు.. సోషల్ మీడియాను ఊపేస్తుంది. వెల్లుల్లి ఒలవడానికి నిమిషాల కొద్దీ టైం తీసుకునే వాళ్లకు ఇదొక అమేజింగ్ వీడియో... సెకన్లలోనే వెల్లుల్లి సిద్ధం చేసేయొచ్చు. దీనిని క్రిస్సీ టీజెన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అలెక్సాండ్రా ఒకాషియో-కార్టెజ్ చెఫ్ పోస్టు చేశారు. 

ఈ వీడియో చూడగానే అదేముందిలే అని పక్కకుపెట్టేవాళ్లు.. ఒకసారి చూడగానే కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. దీంతో ట్విట్టర్ లో వారి రియాక్షన్‌లు వరదలా వెల్లువెత్తుతున్నాయి. దీనిని మేం కూడా చేస్తామంటూ ట్విట్టర్లో కామెంట్ పెడుతున్నారు. 

 

Garlic Peeling
Garlic

మరిన్ని వార్తలు