ట్రాన్స్ జెండర్ పై గ్యాంగ్ రేప్

Submitted on 22 October 2019
Gang rape on transgender in pakistan

పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. కామలి నగరంలోని ధూప్ సారిలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్ జెండర్ ఓ ఈవెంట్ కోసం (సెప్టెంబర్ 20, 2019) ధూప్ సారికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్వగ్రామాలకు బయలుదేరారు.

మార్గంమధ్యలో ఐదుగురు దుండగులు నలుగురు ట్రాన్స్ జెండర్స్ ను అడ్డుకున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటి ఆగకుండా వారిలో ఓ ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి, సమీపంలోని ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లారు. అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. మూడు గంటల పాటు ట్రాన్స్ జెండర్ నరకం చూపించారు. చిత్ర హింసలకు గురి చేశారు. అనంతరం సహివాల్ నగరంలో విడిచి పెట్టి పారిపోయారు.

ఓ స్నేహితురాలి ద్వారా ఇంటికి చేరుకున్న ట్రాన్స్ జెండర్.. మరుసటి రోజు హరప్పా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ట్రాన్స్ జెండర్ సహివాల్ డీపీఓకు ఫిర్యాదు చేశారు. డీపీఓ సూచన మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. నెల రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేశారు. 
 

Gang Rape
transgender
Pakistan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు