కరీంనగర్ లో రూపాయికే అంత్యక్రియలు

Submitted on 20 May 2019
Funeral for one rupee in karimnagar

నగరంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈమేరకు నగర మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. నగరంలో ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరపున అంత్యక్రియలు చేపడతామన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం (మే 20, 2019)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీని కోసం నగరపాలక సంస్థ రూ.1.50 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రత్యేకంగా రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

జూన్ 15, 2019 వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అములోకి తీసుకొస్తామన్నారు నగర మేయర్. ఇంటి దగ్గర నుంచి శ్మశానవాటిక వరకు వాహనం, దహన సంస్కారాలకు సంబంధించి ఇతర ఏర్పాట్లకయ్యే ఖర్చును నగరపాలక సంస్థనే భరిస్తుందన్నారు. నగరవాసులకు శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలదేనని స్పష్టం చేశారు. 
 

funeral
one rupee
Karimnagar
KMC

మరిన్ని వార్తలు