దాతలిచ్చిన డబ్బుతో 4ఎకరాల స్థలం కొనుగోలు : వెలుగులోకి రవిప్రకాశ్-సిలికానాంధ్ర అక్రమాలు

Submitted on 9 October 2019
frauds of ravi prakash silicon andhra hospital

కూచిపూడిలో సంజీవని ఆస్పత్రి పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లా కూచిపూడిలోని హనుమాన్‌పేటలో 4 ఎకరాల స్థలాన్ని కొంతకాలం క్రితం కొనుగోలు చేశారు. దాతలు ఇచ్చిన సొమ్ముతోనే భూమిని కొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లు, ఎన్నారై దాతల కోసం అపార్ట్‌మెంట్లు కడతానని కూచిబొట్ల ఆనంద్‌ చెప్పారని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. ఆస్పత్రి నిర్మాణ సమయంలో.. అడ్డుగా ఉన్న 16 కుటుంబాల ఇళ్లను కూడా తొలగించారు. వారికీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టిస్తానని కూడా హామీ ఇచ్చినా.. ఇంతవరకూ నెరవేరలేదు. 

కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది. ఆస్పత్రిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌.. గుడివాడ ఆర్డీవోను ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

ఉచిత వైద్య సేవలు ఎందుకు అందించడం లేదన్న ప్రశ్నలకు నీళ్లు నములుతున్నారు సంజీవని ఆస్పత్రి సిబ్బంది. ఫీజు కట్టలేని పేదలకు మాత్రం ఉచితం అంటూ బుకాయిస్తున్నారు. అటు.. విజయవాడ, ఇతర ప్రాంతాల ఆస్పత్రులతో పోల్చితే.. తమ ఛార్జీలు తక్కువే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ.... కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్ నిర్మాణం. కానీ.. ఆస్పత్రిలో సేవలు మాత్రం నిల్‌. అత్యాధునిక వైద్యం కాదు కదా.. సాధారణ చికిత్స కూడా అక్కడ ఉచితంగా అందడం లేదు. ఇదీ కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారం. పేరు పెట్టుకోవడంలోనూ.. విరాళాలు సేకరించడంలోనూ శ్రద్ధ చూపించిన రవిప్రకాశ్.. ఆస్పత్రిలో చికిత్సల విషయంలో మాత్రం పట్టించుకోలేదు. అసలు..చికిత్సనందించే ఏర్పాట్లే చేయలేదు.

Ravi Prakash
siliconandhra
sanjivani hospitals
fraud
funds
donations
mla kaila anil kumar
Pamarru

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు