మిస్టరీ ఏంటి : ఇంట్లో ఉరి వేసుకున్న కోడెల

Submitted on 16 September 2019
Former speaker Kodela Siva Prasad suicide

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు. సోమవారం(సెప్టెంబర్ 16,2019) ఉదయం ఈ ఘటన జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కోడెల చనిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు షాక్ కు గురయ్యారు. కోడెల మృతి పట్ల పార్టీ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో కోడెల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత పలు కేసులతో కోడెల సతమతమవుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు. గుంటూరులో తన అల్లుడి నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ కి వచ్చారు. 3 రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉన్నా.. ఆయన చేయించుకోలేదని తెలుస్తోంది. కోడెల కుమారుడు శివరామ్, కుమార్తెలపైనా కేసులు నమోదయ్యాయి.

కోడెల కుమారుడు, కూతురు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కోడెల కుమారుడు శివరామ్ కి చెందిన హోండా షోరూమ్ ని అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని క్లోజ్ చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ ని కోడెల తన ఇంట్లో వాడుకున్నట్లు తేలింది. దీనిపైనా కేసు బుక్ అయ్యింది. ఇక కోడెల ట్యాక్స్ పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు కోడెల కుటుంబంపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీస్ స్టేషన్ లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కట్టారు.

పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా కోడెల ముద్ర వేసుకున్నారు. పల్నాడు పులిగా పేరు పొందారు. అలాంటి కోడెల ఉరికి వేలాడుతూ కనిపించే సరికి తొలుత ఆ దృశ్యాన్ని చూసిన సహచరులు హతాశులయ్యారని సమాచారం. ఆ వెంటనే తేరుకుని ఆయన్ను కిందకు దింపారు. అప్పటికే సరికే శ్వాస తీసుకోవడంలో కోడెల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. వెంటనే కోడెలని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేసినా కోడెలని కాపాడుకోలేకపోయారు.

కొన్ని రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువు తియ్యాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తూ వస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేసినట్టు కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల కుటుంబం తన సొంతానికి వాడుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారు.

former speaker
Kodela Siva Prasad
Suicide
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు