former NASA engineer obstacle course squirrel feeder is amazing to watch

ఇంజనీర్ పజిల్ ని సైతం ఛేదించిన ఉడుతలు: వెరీ స్మార్ట్ అంటున్న నెటిజన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉడుత. ఈ చిరుప్రాణి అందంలోనే కాదు తెలివితేటల్లో కూడా ఏమాత్రం తీసిపోవని నిరూపించాయి. నాసాలో పనిచేసిన ఓ ఇంజనీర్ క్రియేట్ చేసిన మేజ్ ను ఛేధించి..అతను  బాక్స్ లో పెట్టిన కమ్మటి వాల్ నట్స్ ను చక్కగా ఆరగించేశాయి. ఇంజనీర్ ఏంటీ..పజిల్ ఏంటీ.. వాల్ నట్స్ ఏంటీ..తినటమేంటీ..ఏంటీ ఉడుతల తెలివితేటల కథాకమామీషు ఏటో తెలుసుకోవాల్సిందే..

మార్క్ రాబర్ అనే ఇంజనీర్ ఒకప్పుడు నాసాలో పనిచేశారు. యాపిల్ కంపెనీలో కూడా చేశారు. అతను తన ఇంటి పెరటిలో పక్షుల కోసం ఓ స్టాండ్ పై బాక్స్ పెట్టి వాటిలో గింజలు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ఉడతలు వచ్చిన ఆ గింజల్ని తినేస్తున్నాయి. ఉడుతలు గింజలు తినటం చూసిన  మార్క్ రాబర్ట్ కు ఓ ఐడియా వచ్చింది.

అలా పక్షుల కోసం పెట్టిన గింజలు ఉడుతలు తినకుండా..ఉడుతల కోసం ప్రత్యేకించి చాలా ఖరీదైన..చక్కటి ప్రొటీన్స్ ఉన్న వాల్ నట్స్ ను పెట్టారు. కానీ ఉడతలు డైరెక్ట్ గా వచ్చి గబగబా వాల్ నట్స్ తినేటయకుండా.. ఓ పజిల్ ను ఏర్పాటు చేశారు. ఆ నట్స్ తినాలంటే ఉడుతల కచ్చితంగా పజిల్ ను ఛేదించాల్సిందే.  వేరే ఏకంగా వచ్చినా..నట్స్ తినటం కుదరకురదు సరికదా..ఉడతపిల్లాల పడింది అంటారే అలాగే పడిపోతాయి ఆ ఉడుతలు. ఉడుతల కోసం  పక్కా ప్లాన్ తో పజిల్ ను తయాచేశారు మార్క్ రాబర్. 

ఓ పక్క నోరు ఊరించే వాల్ నట్స్ ఉడుతల్ని రాబర్ పెట్టిన నట్స్  ఊరిస్తున్నాయి. వాటిని తినటానికి బయలుదేరాయి. కానీ మధ్యలోనే పడిపోయాయి. అలా ఉడుతలు తెలివితేటలకు పదునుపెట్టాయి. అలా ఉడుతల నట్స్ తినటానికి యుద్దం మొదలుపెట్టాయి. మేధోమథనం చేశాయి. తమ తెలివితేటలకు పదును పెట్టాయి.చివరకు సాధించాయి. 

మొదట్లో వాల్స్ నట్స్ ని తినటానికి వెళ్లే దారిలో ఎదురయ్యాయి, అలా రాను రాను ఆ అవరోధాలను తమ తెలివితేటలతో ఛేదించుకూంటూ వాల్ నట్స్ ను ఎలా తిన్నాయా అనేదీ ఈ 14 నిమిషాల పాటుఉండే  వీడియో కాన్సెప్ట్. 

మొదట్లో ఉడుతలు నట్స్ దగ్గరకు వెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. కానీ ట్రై అండ్ ట్రై అన్నట్లుగా పట్టిన పట్టు విడిచిపెట్టకుండా తమ తెలివితేటలతో నట్స్ ను సాధించాయి..ఈ పజిల్ వీడియో లో ఉడుతలు ఎంత స్మార్ట్ గా ఆలోచించాయో తెలుసుకోవాల్సిందే. ఈ వీడియోకు సోషల్ మీడియాలో అపూర్వమైన స్పందన వచ్చింది. ఇంజనీర్ ప్రతిభకే కాదు వాల్ నట్స్ తినటానికి ఉడుతలు ఉపయోగించిన లివితేటలకు నెటిజన్లు ఫిదా అంటే ఫిదా అయిపోతున్నారు.

వైరల్ గా మారిన ఈ వీడియోకి 88.8 లక్షల వ్యూస్ వచ్చాయి. వినోదాత్మకంగానే కాదు వెరీ ఇంట్రెస్ట్ గా ఉన్న ఈ వీడియో నెటిజన్ల్ హృదయాలనుదోచుకుంటోంది.

Related Posts