పరారీలో ఉన్నారా? : TV9 రవిప్రకాష్ కుట్రలు బట్టబయలు

Submitted on 9 May 2019
Forgery Case Filed Against TV9 CEO | Police Searching For Ravi Prakash

TV9 సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ ? ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లంట్ కలకలం రేపుతోంది. సీఈవో రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కంప్లయింట్ చేశారాయన. తన సంతకం ఫోర్జరీ చేశారని.. నిధులను దారి మళ్లించారని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీ గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు రవి ప్రకాష్, అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. TV9 కార్యాలయం, రవి ప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 


టీవీ9 సంస్థలోని 91 శాతం వాటాను అలంద మీడియా కొనుగోలు చేసింది. 9 శాతం వాటా మాత్రమే రవి ప్రకాష్‌ దగ్గర ఉంది. యాజమాన్యం మారినప్పటి నుంచి టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాష్ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. యాజమాన్యం మారిన తర్వాత నలుగురు కొత్త డైరెక్టర్లను బోర్డులో చేర్చడానికి తీర్మానం చేశారు. కేంద్ర సమాచార శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అయినా కొత్త డైరెక్టర్ల నియామానికి రవి ప్రకాష్ అడ్డు తగిలారనేది అలంద మీడియా చెబుతోంది.

యాజమాన్యం మారిన తర్వాత.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, నిధులు దారి మళ్లించారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు గుర్తించారు. పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీఈవో రవి ప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కంప్లయింట్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. TV9 ఆఫీసు, ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. తన అనుచరుల ద్వారా రవి ప్రకాష్.. టీవీ9 ఆఫీసు నుంచి ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌ మాయం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టీవీ9 ఆఫీస్ నుంచి ఫైళ్లు, ల్యాప్ ట్యాప్ నుంచి.. రవిప్రకాష్ ఎందుకు రహస్యంగా తీసుకెళ్లారనే విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం రవి ప్రకాష్ అజ్ణాతంలో ఉన్నారు. 

Forgery Case
filed
against
TV9 CEO
Police Searching
Ravi Prakash

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు