విమానంలోనే ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

Submitted on 14 May 2019
Filipino baby born in plane

విమానంలోనే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. ఫిలిప్పిన్స్ విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా పురిటినొప్పులు వస్తుండటంతో సిబ్బంది సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం అక్కడికి చేరుకోవడానికి ముందే ఎయిర్‌పోర్టుకు సమాచారం అందజేయడంతో జూబ్లీ హిల్స్, అపోలో ఆసుపత్రి వైద్య బృందం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. విమానం ఆగిన వెంటనే కూర్చున్న సీటులోనే నార్మల్ డెలీవరీ చేయించారు. 

సౌదీ ఆరేబియాకు చెందిన ఆ మహిళకు 35వారాల గర్భంతో విమానంలో ప్రయాణిస్తుంది. అర్థరాత్రి 2గంటల సమయంలో అపోలో ఆసుపత్రికి ఫోన్ వచ్చింది. వెంటనే బయల్దేరిన వైద్యులు విమానం ల్యాండ్ అయ్యేలోపే అక్కడికి చేరుకున్నారు. మహిళను బయటికి తీసుకువచ్చేంత సమయం కూడా లేకపోవడంతో కూర్చున్న సీట్లోనే డెలీవరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

వైద్య బృందంలో ఒకరైన జూనియర్ కన్సల్టెంట్ సి.అర్చనారెడ్డి మాట్లాడుతూ.. నార్మల్ డెలీవరీ చేయడంతో ఆమె చాలా రక్తం కోల్పోయింది. కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. పుట్టిన శిశువు 3.2కేజీలతో ఆరోగ్యంగా ఉంది. సెక్యూరిటీ కారణాల రీత్యా కొన్ని పరికరాలు మేం ఎయిర్‌పోర్టులోకి తీసుకువెళ్లలేకపోయాం. అందుకనే పేగు కట్ చేయలేదు. డెలీవరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాం' అని తెలిపారు. 

philippines
Shamshabad Air Port
Rajiv Gandhi International Airport

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు