ఫ్యాన్స్ హంగామా : ఎన్టీఆర్‌ని బయటకి రప్పించారు

Submitted on 20 May 2019
Fans Hungama at NTR House

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అభిమానుల పోస్టులతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ప్రభాస్, వెంకటేష్, మహేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక సినీ పరిశ్రమనుండి కె.రాఘవేంద్ర రావు, పరుచూరి గోపాలకృష్ణ, కమల్ హాసన్, రామ్ చరణ్, కోన వెంకట్, రానా దగ్గుబాటి, సాయి ధరమ్‌తేజ్, కాజల్, కోన వెంకట్, బాబీ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, చలపతిరావు, సుధీర్ బాబు, ఈషా రెబ్బా, ప్రణీత, హంసా నందిని వంటి ఎందరో సెలబ్రిటీలు తారక్‌కి బర్త్‌డే విషెస్ చెప్పారు.

తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ముందురోజు అర్దరాత్రి నుండి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇంటివద్ద భారీ సంఖ్యలో వచ్చి చేరారు. వాళ్ళ నిరీక్షణకు ఫలితంగా తారక్ ఇంటి టెర్రస్‌పై నుండి అభిమానులకు అభివాదం చేసాడు. తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసాడు యంగ్ టైగర్.. అభిమానులు ఎన్టీఆర్ నివాసం వద్ద హంగామా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Happy Birthday NTR
Fans Hungama at NTR House

మరిన్ని వార్తలు