సూపర్ స్టార్స్ ‘ఫ్యామిలీ’ షార్ట్ ఫిల్మ్

Submitted on 7 April 2020
FAMILY - A unique "MADE-AT-HOME" Short Film

తమవంతుగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి, అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమేయాలని సూచిస్తూ సినీ తారలు నడుం బిగించారు. ప్రజలను చైతన్యపరచడానికి ‘ది ఫ్యామిలీ’ అనే సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ను సోనీ నెట్‌వర్క్‌ రూపొందించింది. పాపులర్ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించగా తెలుగు, తమిళ్‌, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లందరూ నటించారు.

అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్‌ చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌ లాల్‌, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శివరాజ్‌ కుమార్‌, దిల్జిత్ దోసంజ్, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రా తదితరులు తమ ఇళ్లల్లోనే ఉండి నటించారు. అలాగే నటీనటులంతా తమ మాతృభాషలోనే మాట్లాడడం విశేషం. కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలనే విషయాన్ని చెబుతూనే సినీ కార్మికులు లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది చూపించారు.

Read Also : మీకు కాళ్లూ చేతులు లేవా.. ఆకతాయికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన రష్మీ..

బిగ్‌బీ తన కళ్లజోడు వెతుక్కోవడంతో ప్రారంభమైన ఈ షార్ట్ ఫిల్మ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అమితాబ్ కళ్లజోడును మిగతావారంతా ఎలా వెతికిపెట్టారనేది ఆసక్తికరంగా చూపించారు. భారతీయ సినీ పరిశ్రమంతా ఒకే కుటుంబమని, ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని అమితాబ్ పిలుపునిచ్చారు. పేద కళాకారులను, కార్మికులను ఆదుకోవడానికి ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.

coronavirus
Covid-19
LOCKDOWN
family
Short Film
Amitabh Bachchan
rajinikanth
Mohanlal
Mammootty
Chiranjeevi
Shiva Rajkumar
RanbirKapoor
Priyanka Chopra
Alia Bhatt

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు