వీడిన మల్కాజ్‌గిరి మర్డర్ : నాన్నను ముక్కలు చేసి చంపింది.. ఫ్యామిలీనే

Submitted on 22 August 2019
Family members killed Kishan maruthi after Malkajgiri murder mistery chased by Police

ఆ ఇంట్లో శవం.. శరీరాన్ని ముక్కలుగా చేశారు. బక్కెట్లో కుక్కి పెట్టారు. మృతదేహం కుళ్లిపోవడంతో భారీగా దుర్వాసన వస్తోంది. హత్య ఎవరు చేశారో తెలియదు. ఎందుకు చేశారో అసలు తెలియదు. హత్యచేసింది ఎవరు.. ఈ హత్య వెనుక ఎంతమంది హస్తం ఉంది. హత్య చేసింది ఇంటివాళ్లా.. బయటివాళ్లో తెలియక పోలీసులు తలలు పట్టేసుకున్నారు. ఇంటివాళ్లా.. బయటివాళ్లా... పోలీసుల అనుమానమే నిజం అయింది.

మర్డర్ మిస్టరీ వీడింది. అసలు హంతకులెవరో తేల్చేశారు పోలీసులు. మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు ఛేదించారు. కిషన్ మారుతిని హత్యచేసింది ఇంటివాళ్లేనని గుర్తించారు. కిషన్ మారుతి భార్య, కొడుకు కూతురు కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.  

మర్డరీ మిస్టరీ.. కొన్నిరోజులగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అనుమానం వచ్చిన ప్రతిచోటా గాలించారు. పోలీసులు ఏ చిన్న క్లూను కూడా వదల్లేదు. ఈ హత్య కేసు.. ఊహించని మలుపు తిరిగింది. అసలు హంతకులెవ్వరో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. 5 రోజుల క్రితం మౌలాలీ ఆర్టీసీ కాలనీలో తండ్రి మారుతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లో కిక్కి దాచిపెట్టి కుమారుడు కిషన్ పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడు 80 ఏళ్ల వృద్ధుడు సుతార్‌ కిషన్‌ మారుతి.. రైల్వేలో రిటైర్డ్‌ లోకో పైలట్‌ గా చేస్తున్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.

ఆగస్టు 15న ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి మారుతి హత్యకు ప్లాన్ చేశారు. కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురు కలిసి మత్తు మందు ఇచ్చి హత్యచేశారు. హత్య విషయం తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఏడు బకెట్లలో నింపేశారు. గోనె సంచుల్లో పెట్టి ఆ బకెట్లను ఇంట్లోనే ఉంచారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోయారు. కొన్నిరోజులకు ఇంట్లో నుంచి బాగా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. గదితాళం పగలగొట్టి ఇళ్లంతా గాలించారు. వాసన ఎక్కడి నుంచి వస్తుందో వెతికారు. చివరికి ఒక బకెట్లో దుర్వాసన రావడంతో తెరిచి చూశారు. అంతే.. అందులో మారుతి మృతదేహం ముక్కలై కనిపించింది. అది చూసి షాకైన పోలీసులు హత్య ఎవరు చేసి ఉంటారు అనే కోణంలో విచారించారు. చివరికి కుటుంబ సభ్యులే మారుతిని హత్య చేసినట్టు తేల్చేశారు.

మృతుడు మారుతికి భార్య గయ, కొడుకు కిషన్‌, అనుపమ, ప్రఫూల్‌ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  పెన్షన్ డబ్బుల కోసమే హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని ఎల్ బీ నగర్ డీసీపీ సంప్రిత్ సింగ్ మీడియాకు తెలిపారు. 

Kishan maruthi
malkajgiri
murder mistery
moulali RTC colony

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు