ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?

Submitted on 14 March 2019
Facebook, Instagram, are still down for some users around the world

ఫేస్‌బుక్ ఫ్యామిలీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌ల కోట్లాదిమంది యూజర్లకు ప్రపంచవ్యాప్తంగా బుధవారం అర్థరాత్రి నుంచి ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తుంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యం కాలేదు.
Read Also : ప్రియురాలిని పెళ్లి పీటల మీదే చంపేసిన ప్రియుడు

మెసేంజర్ మొబైల్ యాప్ బాగానే పనిచేసినప్పటికీ.. డెస్క్ టాప్‌లో మాత్రం లోడ్ కాలేదు. ఫేస్‌బుక్‌కి చెందిన యాప్‌లలో వాట్సప్ మాత్రమే కరెక్ట్‌గా పని చేసింది. మెయిన్‌టేనెన్స్ కారణంగా ఫేస్‌బుక్ డౌన్ అయ్యిందని... కొద్ది నిమిషాల్లో అంతా సెట్ అవుతుందనే మేసేజ్‌లు దర్శనం ఇవ్వగా ఏమైందో అర్థంకాక యూజర్లు కంగారుపడ్డారు. 

భారత్‌తోపాటు ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఫిలిప్ఫిన్స్, టెక్సాస్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఫేస్‌బుక్ సరిగా పని చేయట్లేదని తెలిసింది. గతంలో జీ-మెయిల్, గూగుల్‌లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయితే బుధవారం ఉదయం యూట్యూబ్‌లోనూ ఈ సమస్యలు తలెత్తగా సామాజిక మాధ్యమాలపై సైబర్ దాడికి కుట్ర జరుగుతుందా? అనే కోణంలో నిపుణులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్.. ట్విటర్ ద్వారా విషయంపై ఫేస్‌బుక్ యూజర్లకు వివరణ ఇచ్చింది. డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు తికమకపడుతున్నారని, ఇంటర్నల్ ఎర్రర్ కారణంగానే ఇలా జరిగినట్టు తెలుస్తోందని, మేం ఈ దీనిని సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామంటూ తెలిపింది.

 

Read Also : డోంట్ మిస్ : రెడ్ మి నోట్ 7 ప్రొ.. సేల్ టుడే : ధర ఎంతంటే?

Face Book
Family Apps Problem
Cyber Attack

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు