ఉద్యోగులే దొంగలు : Paytm మాల్‌లో ‘క్యాష్ బ్యాక్’ చీటింగ్!

Submitted on 14 May 2019
EY probes cashback fraud at Paytm Mall, to build tech-driven prevention system

పేటీఎం గ్రూపు ఈ కామర్స్ మార్కెటింగ్ పేటీఎం మాల్ లో Cash Back Fraud వెలుగులోకి వచ్చింది. ఈ ఫ్రాడ్ కేసుతో ప్రమేయం ఉన్న వారిపై కన్సల్టింగ్ అండ్ అడిట్ మేజర్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) ఇన్వెస్టిగేట్ చేస్తోంది. క్యాష్ బ్యాక్ చీటింగ్ లో పేటీఎం మాల్ ఉద్యోగులు, మర్చెంట్స్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ మొదలైంది. 

ఫేక్ ఆర్డర్లు క్రియేట్ చేసి మోసం :
అలీబాబా కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు థర్డ్ పార్టీ వెండర్లతో పనిచేస్తున్నారని, ఫేక్ ఆర్డర్లు క్రియేట్ చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ల నిధులను పక్కకు మళ్లిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈవై విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే సదరు ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ఫ్రాడ్ ప్రెవెన్షన్ సిస్టమ్ ప్లానింగ్ :
Paytm Mall భాగస్వామ్యంలో భాగంగా.. EY.. ఫ్రాడ్ ఎలా జరిగింది అనేదానిపై అడిట్ చేస్తోందని, ఫ్రాడ్ ప్రెవెన్షన్ సిస్టమ్ ను డెవలప్ చేయనున్నట్టు ఈమెయిల్ స్టేట్ మెంట్ తెలిపింది. ప్రస్తుతం పేటీఎం మాల్ లో సిస్టమ్ స్ట్రక్చర్.. చీటింగ్ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు.. హ్యుమన్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండెంటీ ద్వారా అడిట్ చేసేలా సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది.

ఫ్రాడ్ మర్చెంట్స్ జాబితాను తొలగించి అవసరమైతే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని పేటీఎం మాల్ తెలిపింది. ట్రస్టడ్ కామర్స్ ప్లాట్ ఫాంను నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టు పేటీఎం మాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మోతె తెలిపారు.

EY
cashback fraud
Paytm Mall
tech-driven
prevention system
E-Commerce Platform

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు