మండిపోతుంది : నిప్పుల గుండం రామగుండం 

Submitted on 15 March 2019
Extreme heatwave forecast for Telangana

హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంపై భానుడు భగభగలాడుతున్నాడు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు అంటే మార్చి 15న భానుడు మరింత ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ..ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వాతావరణంలో తేమ శాతం మరింతగా తగ్గిపోయి వేడి పెరగనుందని తెలిపింది.
Read Also: నిలువునా దోచేస్తున్నారు : బుక్‌ మై షో, పీవీఆర్ చీటింగ్‌ బట్టబయలు

నిప్పుల గుండంలా రాంగుండం
మార్చి 14న రాష్ట్రంలోని రామంగం నిప్పుల గుండంగా మారింది. 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ లో సాధారణం కంటే 2.5 డిగ్రీల వేడి పెరిగింది. ఖమ్మంలో 2.8 డిగ్రీలు అధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి

 • రామగుండం   40.4
 • జమ్మికుంటల 40.3
 • కూసుమంచి  40.2
 • గూడాపూర్    40
 • మహబూబ్ నగర్ 39
 • మెదర్            39
 • నిజాబాబాద్     39
 • హైదరాబాద్  38
 • ఆదాలాబాద్ 38
 • భద్రాచలం  38
 • హన్మకొండ 36
 • హకీంపేట 37
 • ఖమ్మం 37
Summer
temperatures
Ramagundam 40. 4 Degrees

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు