అఖిల ప్రియ ఆగ్రహం : నా భర్తను, కుటుంబాన్ని ఎస్పీ టార్గెట్ చేశారు

Submitted on 23 October 2019
Ex Minister Akhila Priya allegations against Kurnool SP

కర్నూలు ఎస్పీ తమ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అఖిలప్రియ. తన భర్త భార్గవ్‌ రామ్‌పై పోలీసులు పెట్టినవి ముమ్మాటికి తప్పుడు కేసులేనన్నారు. ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులు మాట్లాడిన ఆడియో టేపులను సాక్ష్యాలుగా గవర్నర్‌కు సమర్పిస్తానన్నారు అఖిలప్రియ. తన కుటుంబసభ్యులకు ఏదైనా జరిగితే జిల్లా ఎస్పీదే బాధ్యతన్నారు.

వేధింపులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. యూసుఫ్‌గూడలోని అఖిలప్రియ ఇంటికి వెళ్లి ఇంట్లో సోదాలు చేసేందుకు యత్నించారు. అయితే సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో సోదాలు ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులను అనుమతించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అఖిల ప్రియ.

జిల్లా ఎస్పీ పర్సనల్‌గా తీసుకుని కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులు మాట్లాడిన ఆడియో టేపులను సాక్ష్యాలుగా గవర్నర్‌కు సమర్పిస్తానన్నారు. చట్టాన్ని గౌరవించి తామే ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయించామన్నారు. వారెంట్ లేకుండా ఇల్లు సెర్చ్ చేస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read More :జాగ్రత్త : ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

Ex Minister
Akhila Priya
allegations
Kurnool SP
Bhuma Family

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు