ఎవ్వరికీ చెప్పొద్దు : అందరికీ చెప్పండి ‘సీక్రెట్ సూపర్ హిట్’ అని

Submitted on 9 October 2019
Evvarikee Cheppoddu running successfully in theaters now

జోష్, వేదం, బద్రీనాధ్, మిర్చి, ‘బాహుబలి’ ‘ఎంసిఏ’, ‘జై లవ కుశ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రాకేష్ వర్రే హీరోగా నటించిన సినిమా.. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’.. గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలైంది. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్‌గా అనిపించడంతో నిర్మాత దిల్ రాజు ఈ మూవీని రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుండే మంచి టాక్ వచ్చింది. ప్రివ్యూ చూసిన సెలబ్రిటీలందరూ సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, హీరోగా నటించడంతో పాటు రాకేషే నిర్మించగా.. బసవ శంకర్ డైరెక్ట్ చేశాడు. సినిమా చూసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిచి అభినందించారు. తను ఈ జెనరేషన్ దర్శకుల దగ్గరినుండి నేర్చుకోవలసింది నేర్చుకుంటూనే.. వారి తగిన సలహాలు, సూచనలు ఇస్తాను అని చెప్పే దర్శకేంద్రుడు.. సినిమా బాగుంటే మేకర్స్‌ని పిలిపించి ప్రత్యేకంగా ప్రశంసిస్తారనే సంగతి తెలిసిందే..

Read Also : శభాష్ ‘సైరా’ : చిరుని అభినందించిన గవర్నర్ తమిళిసై..

హీరో కమ్ నిర్మాత రాకేష్, దర్శకుడు బసవ శంకర్ ఇద్దరినీ ఆయన అభినందించారు. తెలుగు ప్రేక్షకులకు చక్కటి క్లీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అందించారని.. రాకేష్ నటన నేచురల్‌గా ఉందని, కొత్తమ్మాయి గార్గేయి కూడా చాలా బాగా నటించిందని.. మరిన్ని మంచి సినిమాలు తీయాలని రాఘవేంద్రరావు వారిని బ్లెస్ చేశారు.  

 

Rakesh Varre
Gargeyi Yellapragada
Sankar Sharma
Basava Shanker

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు