everyone-wants-go-new-zealand-because-country-has-eliminated-coronavirus

గుడ్ న్యూస్: కరోనాను ఖతం చేసిన న్యూజిల్యాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్వ పటిమ, భారీగా పరీక్షలు నిర్వహించడం, హాస్పిటల్స్ ను రెడీగా ఉంచడం, తదితర చర్యల ద్వారా అతి త్వరలోనే కరోనా చైన్ ను బ్రేక్ చేయగలిగింది న్యూజిల్యాండ్. అయితే కరోనా కేసులు లేకపోయినప్పటికీ ఆ దేశం అప్రమత్తంగా ఉంది. గడిచిన కొన్ని రోజులుగా ఆ దేశంలో సింగిల్ డిజిట్ లో కరోనా కేసులు నమోదవగా,సోమవారం ఒకే ఒక్క  కొత్త కరోనా కేసు నమోదైంది. అది కూడా ఏవిధంగా సోకిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక మంగళవారం 5కొత్త కేసులు నమోదయ్యాయి. 

న్యూజిల్యాండ్ లో న్యూజిల్యాండ్‌లో అయిదు వారాల పాటు కఠిన లాకడౌన్‌ను అమలు చేశారు. సోమవారంతో గడువు ముగిసింది.  ఆధునిక చరిత్రలోనే ఇంత తీవ్రంగా ఏ దేశంలోనూ ఇంత కఠినంగా లాకడౌన్‌ అమలు చేయలేదని ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం నుంచి దేశంలో లాకడౌన్‌ నిబంధనలను సడలించారు. లాక్ డౌన్ ఆంక్షలను లెవల్ 4స్థాయినుంచి లెవల్ 3స్థాయికి తీసుకెళ్లింది న్యూజిల్యాండ్. దీంతో లక్షలాది మంది తిరిగి విధుల్లో చేరిపోయారు. 75 శాతం ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు ఒక్కరోజులోనే ఊపందుకున్నాయి.

అయితే, కరోనాను అధిగమించామని సంబరాలు చేసుకోవడానికి ఇది సమయం కాదని జసిందా తెలిపారు. అమెరికాలో మొదటి కరోనా కేసు నవెూదైన నెల తర్వాత న్యూజిల్యాండ్‌లో ఫిబ్రవరి 28న మొదటి కరోనా కేసు రికార్డయింది. ఆ తర్వాత జసిందా అత్యవసర చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్స్ ను రెడీ చేశారు. అవసరమైన మందులు సిద్ధం చేయించారు. వెంట వెంటనే నిబంధనలు విధిస్తూ వైరస్‌ విజృంభించకుండా చర్యలు తీసుకున్నారు. దేశంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని మార్చి 14 తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్‌కు పంపించారు. మార్చి 19 తర్వాత దేశంలోకి విదేశీయులు ఎవరూ రాకుండా నిషేధం విధించారు. మార్చి 23 నుంచి దేశంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్‌ విధించారు.

అప్పటికి దేశంలో నవెూదైన కేసులు కేవలం 102 మాత్రమే. అయినప్పటికీ, తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకున్నారు. వేగంగా స్పందించారు. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాజిటివ్‌ల శాతం కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. జనం మద్దతుతోనే ఇది సాధ్యమయిందని, ఇక ఆర్థిక వృద్ధిని తిరిగి సాధారణ స్థితికి తెస్తామని ప్రధాని జసిందా ధీమాగా చెప్పారు.

న్యూజిల్యాండ్ ప్రధాని జసిందా మరో ట్వీట్ లో…మనం చెప్పినట్లుగా ఎలిమినేషన్ అంటే మనం సున్నాకి చేరుకోవచ్చని అర్థం. కాని మనకు తక్కువ సంఖ్యలో కేసులు మళ్లీ రావచ్చు. అంటే మనం విఫలమయ్యామని కాదు. దీని అర్థం…ఆ కేసుల యొక్క చాలా దూకుడు నిర్వహణను కలిగి ఉండటానికి మరియు ఆ సంఖ్యలను తక్కువగా ఉంచడానికి సున్నా సహనం విధానాన్ని కలిగి ఉన్న స్థితిలో మనం ఉన్నామని అని జసిందా తెలిపారు. న్యూజిల్యాండ్ లో ఇప్పటివరకు 1,474 కరోనా కేసులు నమోదవగా,19మంది ప్రాణాలు కోల్పోయారు. 1,229మంది కోలుకున్నారు.

Related Posts

Trending

Latest News