పేదలకు వరం : బస్తీ దవాఖానాల్లో స్పెషలిస్ట్ వైద్యం

Submitted on 22 January 2019
Evening Specialist Treatment for Urban Poor  Medical, Health Department,

పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో యోచన
పట్టణ పేదల కోసం బస్తీ దవాఖానాలు
సాయంకాలం స్పెషలిస్ట్ వైద్యం
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా 
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌   జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభం 


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సేవలను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేసేందుకు పట్టణాల్లో వుండే పేదల కోసం వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. బస్తీల్లో దవాఖాలను మరింతగా విస్తరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న ఆరోగ్య శాఖ పట్టణ పేదలకు పట్టణ పేదలకు స్పెషలిస్టు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌   జిల్లాల్లో వైద్య సేవలను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు జరగుతున్నాయి. 

దీని కోసం ముందుగా హైదరాబాద్‌లో గగన్‌మహల్‌, పానీపురా, అజమ్‌పురా, అమీర్‌పేట తదితర చోట్ల సోమవారం స్పెషలిస్టు వైద్యసేవలు అందించేందుకు గాను చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ లతో సంప్రదింపులు జరిపి..బస్తీ ప్రజలను కలుసుకుని వారి స్పందనను తెలుసుకున్నారు. బస్తీలలో ఎటువంటి వైద్యం అందించాలి..అత్యవసరంగా కావాల్సిన  ట్రీట్ మెంట్స్ ఏమిటి అనే అంశంపై బస్తీల పరిశీలనలో వారికి ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా స్పెషలిస్టు వైద్యసేవల విధానాన్ని రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలకూ విస్తరించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 

హైదరాబాద్‌ మహానగర పరిధిలో 145, మిగిలిన రాష్ట్రంలో 100 యూపీహెచ్‌సీలుండగా...రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ సాయకాలం స్పెషలిస్ట్ వైద్యాన్ని పట్టణ యూపీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల)లో ప్రారంభించనుంది. ఈ క్రమంలో పట్టణ పేదలకు స్పెషలిస్ట్ ట్రీట్ మెంట్ ను మరింత చేరువ చేసేందుకు ‘బస్తీ దవాఖానా’లను ప్రవేశపెట్టింది. సుమారు 5వేల జనాభాకు ఒకటి చొప్పున ఈ బస్తీ దవాఖానాలు వైద్యసేవలు అందించాలన్నది లక్ష్యంగా వుంది. బ్రతుకు తెరువు కోసం కూలీనాలి పనులకు వెళ్లి ఇళ్లకు చేరుకునేవారికి వీలుగా ఈ సేవలు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 నుంచి గంటల వరకూ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఈ ఆసుపత్రులలో ఒక డాక్టర్, నర్సు, ఒక కంపౌండర్ అందుబాటులో ఉంటారు. 
అంతేకాదు సాధారణ డాక్టర్స్ తో పాటు స్పెషలిస్ట్ లతో కూడిన ట్రీట్ మెంట్ ను  సాయంత్రం 4 నుంచి 8 గంటల సమయంలో స్పెషలిస్టు వైద్యుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 

Telangana
Hyderabad
Medical
Health Department
Ranga Reddy
Medchal
Specialist Treatment

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు