దేశంలో ఫస్ట్ టైమ్ : 5జీ లైవ్ వీడియో కాల్

Submitted on 16 October 2019
ericson 5g show in imc

టెలికాం రంగంలో అద్భుతం జరగనుంది. టెక్నాలజీ మరింత డెవలప్ కానుంది. 5జీ ఎంట్రీతో అంతా మారిపోనుంది. 4జీ సేవల వల్ల ఎలాంటి సౌలభ్యం లభిస్తుందో కళ్లారా చూస్తున్నాం. మొబైల్ లో అత్యంత వేగంగా డేటా ట్రాన్సఫర్ కి వీలు కల్పిస్తోంది 4జీ. ఇక 5జీ వస్తే.. మర్ని అద్భుతాలు జరగడం ఖాయం అంటున్నారు.

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2019లో.. స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్‌ అని, క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌(సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌(ఎమ్‌ఎమ్‌వేవ్-28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ బాండ్స్‌) స్పెక్ట్రమ్‌ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్‌ స్పెక్ట్రమ్‌ కీలకమైందని అన్నారు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), మెషీన్‌ టు మెషీన్‌ కమ్యూనికేషన్స్‌ వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానుందని మిర్టిల్లో చెప్పారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. 2020 నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్‌కామ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాడియా తెలిపారు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు  భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే.

టెలికాం రంగంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో ప్రారంభమైంది. 5జీ సేవలే ప్రధాన అంశంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 500 టెలికాం సంస్థలు, 250 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. తమ నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ దక్షిణాసియాలోనే ముఖ్యమైంది.

ericson
5G
live video call
imc
india mobile congress

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు