ED seizes 146 kg gold jewellery worth over Rs 82 cr of Musaddilal Jewellers

ఈడీ సోదాలు : హైదరాబాద్‌లో 146 కిలోల బంగారం స్వాధీనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ముసాద్దీలాల్ జువెలర్స్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నగరంలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో

హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ముసాద్దీలాల్ జువెలర్స్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నగరంలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ.82 కోట్ల విలువ చేసే 146 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జువెలర్స్ యజమాని కైలాష్ గుప్తాతో పాటు మరో నలుగురి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

నోట్ల రద్దు సమయంలో ముసాద్దీలాల్ జవెలర్స్ లో రూ.110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు జరిపి బంగారం సీజ్ చేశారు. విజయవాడలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లోనూ తనిఖీలు చేసి గోల్డ్ సీజ్ చేశారు. కైలాష్ గుప్తాతో పాటు బాలాజీ గోల్డ్ కంపెనీ యజమాని పవన్ అగర్వాల్, అష్ట లక్ష్మీ గోల్డ్ ప్రొప్రైటర్ నీల్ సుందర్, చార్టెట్ అకౌంటెంట్ సంజయ్ ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు.
Also Read : మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

ముసాద్దీలాల్ జువెలర్స్ పై మనీ లాండరింగ్ కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2016 నవంబర్ 8న ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు చాలామంది అక్రమాలకు పాల్పడ్డారు. ముసాద్దీలాల్ జువెలర్స్ లో అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ అధికారులు కేసులు పెట్టారు.

రెండు రోజులుగా ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో ముసాద్దీలాల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.110 కోట్ల బ్లాక్ మనీని తప్పుడు బిల్లులతో వైట్ మనీగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే ముసాద్దీలాల్ ఎండీ కైలాష్ చంద్ గుప్తా, అతడి కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ పర్యవేక్షణలో ముసాద్దీలాల్ సంస్థలపై దాడులు నిర్వహించారు.
Also Read : మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్

Related Posts