వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే.. డబ్బులిస్తున్నారు

Submitted on 23 August 2019
Ecuador city recycling plastic bottles for bus tickets

అనేక దేశాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాడు. క్రమేపీ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు యత్నిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం విషయంలో ఈక్వెడార్ ప్రభుత్వం ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తోంది. 

ఈక్వెడార్‌లోని గయాకిల్ నగరంలో దాదాపుగా 2.7 మిలియన్ల జనాభాను కలిగి ఉంటుంది.  దేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం గయాకిల్.  దేశవ్యాప్తంగా గయాకిల్ నగరంలోనే ఎక్కువగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో గయాకిల్ అంతా చెత్తగా తయారైంది. నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలనుకుంది ప్రభుత్వం. దీని కోసం చక్కటి ఆలోచన చేసింది. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఇస్తే డబ్బులు ఇవ్వడం మొదలు ప్రారంభించారు. అలా వచ్చిన బాటిల్స్ ను రీసైక్లింగ్ చేస్తున్నారు. 

వాడి పడేసిన ఒక్క ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే 2 సెంట్లు ఇస్తారు.15 బాటిల్స్‌కు 30 సెంట్లు వస్తాయి. ఆ డబ్బులతో మెట్రో టిక్కెట్ కొనుగోలు చేసి వెళ్లవచ్చని గయాకిల్ లో ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.  చాలా మంది వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను కలెక్ట్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ మెషిన్‌ల వద్ద బారులు తీరి మరీ వాటిల్లో ఆ బాటిల్స్‌ను డిపాజిట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. 
ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఈక్వెడార్ ప్రభుత్వం సంతోషం వ్యక్తంచేసింది. ప్రజల నుంచి మంచి స్పందిన వచ్చిందనీ..ఇప్పటికే  టన్నులకొద్దీ  ప్లాస్టిక్ బాటిల్స్‌ను తొలగించామని తెలిపింది. ఇప్పుడు నగరంలో  ప్లాస్టిక్ ప్రభావం చాలా వరకూ తగ్గిందని గయాకిల్  అధికారులు చెబుతున్నారు.

Ecuador
City
recycling plastic bottles for bus tickets

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు