EC Suspends CI for grant station bail

స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు సీఐ సస్పెండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తప్పుబట్టారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు ఆయన.  గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేశారు.

వారి స్థానాలలో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఆదేశించారు. ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని అన్నారు. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయం అని అన్నారు. వలంటీర్లపై ఆరోణల విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

అలాగే మాచర్లలో తెలుగుదేశం నేతలు, బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడులు చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచెర్లలో దాడి చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై పోలీసు అధికారిని బాధ్యున్ని చేస్తూ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ని సస్పెండ్ చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేశారు.  

Related Posts