‘ఈ-టంగ్‌’ : రుచి చూసి ‘కారం’ ఎంతుందో చెప్పేస్తుంది 

Submitted on 14 May 2019
E-tongue : More Spice In Food And Can Help In Test-Tasting

టెక్నాలజీ డెవలప్ మెంట్ రోజు రోజుకు పెరుగుతోంది. మనిషి అన్ని పనులకు టెక్నాలజీ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో ఫుడ్ ఐటెమ్స్ టేస్ట్ చూసి దాంట్లో స్పైసీ పర్సెంట్ ఎంత శాతం ఉందో చెప్పే ‘ఈ టంగ్’ (ఎలక్ర్టానిక్‌ నాలుక)ను కనిపెట్టారు సైంటిస్టులు. ఇప్పుడంతా స్పైసీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆహార ప్రియులు. అందుకే మార్కెట్ లో అంతా స్పైసీ..స్పైసీ ఐటెమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓ ఫుడ్ ఆర్డరిచ్చి..ప్లేట్ కళ్లముందుకొచ్చాక గబా గబా నోట్లో వేసుకుంటాం. దాంట్లో స్పైసీ కంటెంట్ ఎక్కువుంటే నషాళానికి అంటుంది. వెంటనే కళ్లల్లోంచి..ముక్కులోంచి  నీళ్లు వచ్చేస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. కానీ ఇప్పుడా బాధ ఉండదు అంటున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు. 

ఫుడ్ లో స్పైసీ పర్సెంటేజ్ ను గుర్తించే  ‘ఈ టంగ్’ (ఎలక్ర్టానిక్‌ నాలుక)ను  పొందించారు వాషింగ్టన్‌ స్టేట్‌ వర్సిటీ సైంటిస్టులు. ఫుడ్ లో స్పైసీ (కారం) శాతం ఎంత ఉందో కచ్చితంగా గుర్తింస్తుంది.ఈ-టంగ్‌ స్పైసీ ఫుడ్‌లోని రుచిని మనుషుల కంటే కరెక్ట్ గా  గుర్తింస్తుందని వారు తెలిపారు. రెండు శాంపిల్‌ ప్యాకెట్ల మధ్య టేస్ట్ లో ఉండే తేడాను ‘ఈ టంగ్’ కూడా  చెప్పేస్తుందని తెలిపారు.
 

E-tongue
spicy
Persent food

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు