జూలై 31 లాస్ట్ డేట్ : ఆన్‌లైన్‌లో Tax Returns ఎలా ఫైల్ చేయాలంటే?

Submitted on 10 July 2019
E-Filing ITR: Here is how to file income tax return online

ఆదాయ పన్ను కట్టాలని అందరికి తెలుసు. కొంతమందికి పన్ను చెల్లించే ప్రాసెస్ తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఐటీ శాఖ సూచించిన గడువు తేదీలోగా పన్ను దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. సరైన సమయంలో పన్ను చెల్లింపులపై చాలామందికి ఎన్నో సందేహలు వ్యక్తమవుతుంటాయి. మరికొందరికి అయితే ఆదాయ పన్ను శాఖలో ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలియకపోవచ్చు. పూర్తి అవగాహనలేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

ఐటీఆర్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎప్పుడూ ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం అంటున్నారు ఐటీ నిపుణులు. చివరి క్షణంలో హడావుడి చేసి ఇబ్బందులు పడటం కంటే ముందుగానే ట్యాక్స్ చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే ఆల్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రీపరేషన్ సాఫ్ట్ వేర్ AY 2019-20 అప్ డేట్ చేసింది. ఈ-ఫిల్లింగ్ ఆప్షన్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ITR ఫైల్ చేసేందుకు ఆర్థిక సంవత్సరం 2018-19 (అసెసెమెంట్ ఇయర్ 2019-20) జూలై 31, 2019 వరకు మాత్రమే గడువు తేదీ ఉంది.

ఇలోగా పన్నుదారులు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫాం 16, ఇన్వెస్ట్ మెంట్ వివరాలు (ఖర్చుల వివరాలు) వెంట ఉంచుకోవాలి. 

ఆన్ లైన్ లో మొత్తం ITR ఫిల్లింగ్ ప్రాసెస్ రెండు విధాలుగా జరుగుతుంది. అందులో ఒకటి Part A, రెండోది Part Bగా విభజించవచ్చు. 

Part - A : 

1. ఆన్ లైన్ లో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా. www.incometaxindiaefiling.gov.in లింక్‌ను ఓపెన్ చేయండి.  
* IT రిటర్న్ ప్రీపరేషన్ సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్ లోడ్స్ మెనూలో.. అసెస్ మెంట్ ఇయర్ 2019-20 అని ఉంటుంది. లేదంటే.. ఈ కింది లింక్ ఓపెన్ చేయండి. లేదంటే ఈ E-filling  లింక్ ఓపెన్ చేయండి. 
2. అసెస్‌మెంట్ ఇయర్ 2019-20 సెలెక్ట్ చేసుకుని JAR (Java Archive) file క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ zip ఫైల్ ను ఎక్స్ ట్రాక్ట్ చేయండి.
3. డౌన్ లోడ్ చేసిన సాఫ్ట్ వేర్ ద్వారా మీ ఆదాయ పన్ను, పేమెంట్స్, ఖర్చుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయండి. 
* మీ వ్యక్తిగత వివరాలతో పాటు ట్యాక్స్ పేమెంట్స్ లేదా TDS ఎంటర్ చేయాలి. 
* ఆ తర్వాత ‘Pre-fill’ button బటన్ పై క్లిక్ చేయండి. 
* అవసరమైన వివరాలు అన్ని పూర్తి చేశారా లేదా మరోసారి చెక్ చేసుకోండి.
4. డేటా అంతా ఎంటర్ చేశాక.. Calculate పై క్లిక్ చేయండి. ఇక్కడే మీ రీఫండ్ లేదా ట్యాక్స్ చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి వడ్డీతో కూడిన మొత్తం ఫైనల్ ఫిగర్ వస్తుంది. 
5. ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే.. వెంటనే అవసరమైన వివరాలు ఎంటర్ చేసి షెడ్యూల్ ప్రకారం పన్ను చెల్లించండి. ఇదే ప్రాసెస్ మరోసారి చేసి చూడండి. పన్ను చెల్లించాల్సిన మొత్తం జీరోకి పడిపోతుంది. అంటే పన్ను చెల్లించనట్టుగా నిర్ధారించుకోవచ్చు. 
6. ఆదాయ పన్ను డేటా XML ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది. ఈ ఫైల్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని పెట్టుకోండి. 

Part -B

1. మీ User Id, Passwordతో e-Filing website లో లాగిన్ అవ్వండి. పుట్టిన తేదీ, Captcha కోడ్ ఎంటర్ చేయండి. 
2. e-File లోకి వెళ్లండి. అక్కడ Upload Return అనే బటన్ పై క్లిక్ చేయండి.
3. ITR సెలెక్ట్ చేసుకోండి. అసెస్ మెంట్ ఇయర్, XML ఫైల్ (Part A)లో సేవ్ చేశారు కదా. 
4. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC), అవసరమైతే.. అప్ లోడ్ చేయండి.
5. ఈ-ఫైలింగ్ తో DSC రిజిస్ట్రర్డ్ అయి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.
6. Submit బటన్ పై క్లిక్ చేయండి. ITR-V విండో డిస్ ప్లే అవుతుంది. (DSC ఒకవేళ వాడకుంటే)
7. ITR-V లింక్ డౌన్ లోడ్ చేసుకోండి. ITR-V లింక్.. మీ రిజిస్ట్రర్డ్ ఈమెయిల్ కూడా వెళ్తుంది. 
ITR.. DSCతో అప్ లోడ్ చేసినట్టయితే.. రిటర్న్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తి అయినట్టే. 

రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఒకవేళ DSC అప్ లోడ్ చేయకుంటే.. ప్రాసెస్ ఇలా ఉంటుంది. 

* రిటర్న్స్ DSCతో అప్ లోడ్ చేయకుంటే.. ITR-V ఫాంను ఫ్రింట్ ఔట్ తీసుకోవాలి. 
* e-Filing చేసిన తేదీ నుంచి 120 రోజుల్లోగా ఫాంపై సంతకంతో CPCకి సమర్పించాల్సి ఉంటుంది.  
* రిసిప్ట్ ఫాంపై సంతకం ఉంటేనే ITR-V ఫాం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. 
* ఇప్పుడు అప్ లోడ్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. 
* ITR కోసం CPCతో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా E-Verify ITR చేసుకోవచ్చు. 
* బ్యాంకు ATM ద్వారా కూడా E-Verify ITR ప్రాసెస్ చేసుకోవచ్చు. 
* E-Verify ITR ప్రాసెస్ చేయాలంటే.. బ్యాంకు అకౌంట్ నెంబర్, డిమాట్ అకౌంట్ నెంబర్, ఆధార్ OTP ద్వారా పూర్తి చేసుకోవచ్చు. 

E-Filing ITR
Income Tax
return online
DSC
ITR-V Form


మరిన్ని వార్తలు